https://oktelugu.com/

Tollywood Movies 2022: రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారి వారి పాట, ఆచార్య లలో ఏది సూపర్ హిట్ సినిమా?

Tollywood Movies 2022: టాలీవుడ్ కు ‘భీమ్లానాయక్’ఓ ఊపు వచ్చింది. ఆ ఊపును కంటిన్యూ చేయడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. కరోనా కల్లోలం పోయి థియేటర్లలో ఆక్యూపెన్సీ ఆంక్షలు పోయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక సర్కారి వారి పాటను ఏప్రిల్ కు ఫిక్స్ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ను కూడా ఈ రెండింటి మధ్యలో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2022 / 06:51 PM IST
    Follow us on

    Tollywood Movies 2022: టాలీవుడ్ కు ‘భీమ్లానాయక్’ఓ ఊపు వచ్చింది. ఆ ఊపును కంటిన్యూ చేయడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. కరోనా కల్లోలం పోయి థియేటర్లలో ఆక్యూపెన్సీ ఆంక్షలు పోయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక సర్కారి వారి పాటను ఏప్రిల్ కు ఫిక్స్ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ను కూడా ఈ రెండింటి మధ్యలో విడుదల చేస్తున్నారు.

    Tollywood Movies 2022

    ఇక ప్రభాస్ రాధేశ్యామ్ ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో మార్చి, ఏప్రిల్ లోనే సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారి వారి పాట, ఆచార్య సినిమాలో ఏది సూపర్ హిట్ కానుందనే దానిపై టాలీవుడ్ లో విశ్లేషణలు సాగుతున్నాయి.

    సహజంగా జక్కన్న చెక్కుడికి ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. రికార్డులు తిరగరాయడం కూడా గ్యారెంటీ అంటున్నారు. ఇక మిగతా సినిమాల్లో ‘రాధేశ్యామ్’ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇదీ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా బాగుంటే కలెక్షన్ల వర్షం కురువనుంది.

    Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

    ఇక టాలీవుడ్ లోనే రిలీజ్ అయ్యే ‘ఆచార్య’, సర్కారివారి పాట సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయి.కొరటాల శివ, పరుశురాం దర్శకత్వం వహిస్తుండడంతో వీటిపై కూడా అంచనాలు పెరిగాయి.

    మొత్తంగా ఈ నాలుగు సినిమాలు వేటికవే ప్రత్యేకం.. కథ, కథనాలు పూర్తి డిఫెరెంట్. ఇందులో ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడం ఖాయం. ఇక ఆ తర్వాత ఏ చిత్రం రెండోస్థానంలో నిలుస్తుందన్నది వేచిచూడాలి.  దీనిపై మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి..

    Also Read: ఒకే పార్టీలో ధనుష్‌ – ఐశ్వర్య.. కానీ పలకరింపు లేదు