ashmika Mandanna wedding : ఇన్ని రోజులు తమ ప్రేమ , పెళ్లి గురించి మీడియాకు, అభిమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యం గా మైంటైన్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక(Rashmika Mandanna) జంట , ఎట్టకేలకు నిన్న ఓపెన్ అయిపోయారు. ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ లో ఇద్దరు ఒకే సారి తమ స్టోరిలలో అభిమానులకు ప్రత్యేకంగా ఒక నోట్ ని వదిలారు. అందులో ఏముందంటే ‘మేమిద్దరం ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు మాకోసం మేము ఏదైనా ఎంచుకునేముందు, మీకు చెప్పకుండా ఏమి చెయ్యము. మీరందరు ఎంతో ప్రేమతో మా జంటకు ‘విరోష్’ అని పేరు పెట్టారు. అందుకే ఈ పెళ్ళికి మేము మనస్ఫూర్తిగా మీరు పెట్టిన పేరునే పెట్టబోతున్నాము. ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’..మీ అందరికి బాగా నచ్చి ఉంటుంది అనే అనుకుంటున్నాము. మాపై ఇంతటి ప్రేమని చూపిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇకపోతే ఈ వివాహమహోత్సవం ఈ నెల 26 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో జరగబోతుంది. ఈ పెళ్ళికి ఇరువురి కుటుంబసభ్యులు , శ్రేయోభిలాషులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం. సినీ సెలబ్రిటీలు చాలా తక్కువ గా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ కి మొదటి నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మంచి సాన్నిహిత్యం ఉంది , ఆయన ఈ పెళ్ళికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ పెళ్ళికి హాజరు అవ్వొచ్చు. ఇకపోతే ఈ జంట మార్చి 4 న హైదరాబాద్ , బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా లో చేసుకోబోతున్నారు. ఈ రిసెప్షన్ కి మాత్రం సినీ సెలబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు. వీళ్ళందరికీ విజయ్ దేవరకొండ స్వయంగా శుభలేఖలు ఇవ్వడం మనమంతా చూశాము. ఎట్టకేలకు ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట మరో ఆరు రోజుల్లో మూడు మూళ్ళ బంధం తో ఒక్కటి కాబోతుంది.
ఇక ఈ ఇద్దరి కెరీర్స్ విషయానికి వస్తే రష్మిక వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తారా స్థాయిలో ఉంటే , విజయ్ దేవరకొండ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘కింగ్డమ్’ భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా అయన ‘రణబలి’ ‘రౌడీ జనార్దన్’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు అంబంధించిన టీజర్స్ ఇమడని విడుదల అయ్యాయి. కానీ రెస్పాన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.