Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒక హీరో వదిలిపెట్టిన సినిమాని మరొక హీరో చేసి డిజాస్టర్ ని మూటగట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఏ సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. ఏ సినిమా డిజాస్టర్ గా మారుతుంది అనే విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మరి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది… సక్సెస్ఫుల్ సినిమాని వదులుకోవడం ఎంత తప్పో, ఫెయిల్యూర్ సినిమాని చేయడం కూడా అంతే తప్పు… ఇందులో ఏ ఒక్క విషయంలో రాంగ్ స్టెప్ వేసినా కూడా వాళ్ళ కెరియర్ ప్రమాదం లో పడే అవకాశాలున్నాయి.
ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న స్టార్ హీరోలందరు కూడా కొన్ని సినిమాలను వదిలేసారు. వాటి వల్ల మరి కొంతమంది హీరోలు ఆ సినిమాలను చూసి సూపర్ సక్సెస్ లను సాధించారు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘బీమ్లా నాయక్’ సినిమాను మొదట బాలకృష్ణ తో చేయాలని అనుకున్నారట…కానీ ఆ సినిమా పవన్ కళ్యాణ్ కి బాగుంటుంది అంటూ బాలయ్య బాబే స్వయంగా ఆ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగ వంశీ కి చెప్పడంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో తీశారు.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో బాలయ్య బాబు ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నాడనే చెప్పాలి… వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ సినిమాను సైతం మొదట వెంకటేష్ తో చేయాలని అనుకున్నారట. కానీ అనుకుని కారణాలవల్ల ఆ సినిమా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది.
మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వకీల్ సాబ్ గా అదరగొట్టి సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా లాయర్ గా తన నట విశ్వరూపాన్ని చూపించిన పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ పాత్రను తెర మీద ప్రజెంట్ చేశాడు అంటూ అతని అభిమానులు ఆ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేశారనే చెప్పాలి…
