Shoaib Malik – Sania Mirza : ఇటు సినీ కళాకారులవి.. అటు క్రీడాకారుల పెళ్లిళ్లు కలకాలం నిలవవని తేలిపోయింది. సినీ ఇండస్ట్రీలో తారల పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. ఇక క్రీడాలోకంలోనూ శిఖర్ ధావన్, గుత్వాజ్వాల లాంటి పెళ్లిళ్లు కూడా పెటాకులయ్యాయి. ఎవ్వరూ తమ భాగస్వామితో కలకాలం కలిసి జీవించలేకపోయారు..
ఇప్పుడు మరో సెలబ్రెటీ జంట కూడా విడిపోయింది. కొద్దికాలంగా దూరంగా ఉంటున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్, భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా జోడి విడిపోయింది. వీరి విడాకుల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయినా కూడా ఎవ్వరూ బయటపడలేదు. కొన్ని హార్డ్ మెసేజ్ లు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు తప్పితే విడాకుల విషయం బయటపడలేదు.

కానీ తాజాగా సానియా మీర్జాకు ఆమె భర్త షోయాబ్ మాలిక్ షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి అయిన షోయాబ్ మాలిక్ కొద్దిరోజులుగా సానియాతో దూరంగా ఉంటున్నారు. వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వచ్చినా కన్ఫమ్ కాలేదు. వీరిద్దరి ఎడం కొనసాగుతున్న వేళ షోయాబ్ మాలిక్ తాజాగా మరో వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నటి సనా జావేద్ ను షోయాబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. సానియాతో విడాకుల విషయం తేలిందో లేదో కానీ సడెన్ గా మరో పెళ్లి చేసుకొని షోయాబ్ షాకిచ్చాడు.
రెండు రోజుల క్రితం ‘విడాకులు అనేది చాలా కష్టమంటూ’ సానియా మీర్జా సోషల్ మీడియాలో ఏమోషనల్ పోస్ట్ పెట్టారు. అది వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే షోయాబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకొని ఆశ్చర్యపరిచాడు.
నిజానికి సానియాకు షోయాబ్ తో మొదటిపెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే పెళ్లి అయ్యి 2010లో అయేషాతో విడిపోయిన షోయాబ్ ను పెళ్లి చేసుకుంది సానియా. నాడే తీవ్ర విమర్శలు వచ్చాయి. పెళ్లి అయ్యి విడిపోయి షోయాబ్ ను ఎందుకు చేసుకున్నావంటూ అందరూ విమర్శించారు. అయినా కూడా షోయాబ్ నే చేసుకుంది.కానీ పాకిస్తాన్ లో సానియా ఉండలేకపోయింది. ఎక్కువగా హైదరాబాద్ లోనే భర్తకు దూరంగా ఉండేది. 2018లో వీరిద్దరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయినా కూడా వీరిద్దరి మధ్య ఎడమే వీరిద్దరూ విడిపోవడానికి కారణంగా చెబుతున్నారు.
పాకిస్తాన్ లో సెటిల్ కావాలని షోయాబ్.. లేదు హైదరాబాద్ లోనో.. దుబాయ్ లోనే ఉందామని సానియా పట్టుబట్టిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో పాక్ ను వదిలి రాలేక షోయాబ్ సానియానే వదిలేశారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇందులో నిజానిజాలు ఏంటో వారిద్దరూ చెప్పడం లేదు. బయటకు రావడం లేదు. మొత్తానికి షోయాబ్ తన దారి తాను చూసుకొని మూడో పెళ్లితో సెటిల్ అయిపోయారు. సానియాకు షాక్ ఇచ్చారు.
ఇక షోయాబ్ తాజాగా మూడో పెళ్లి చేసుకున్న సనాజావేద్ కు కూడా ఇంతకుముందే పెళ్లి అయిపోవడం గమనార్హం. ఆమె 2020లో పాక్ కు చెందిన ఓ సింగర్ ను పెళ్లి చేసుకుంది. 2023లో విడిపోయింది. ఇప్పుడు షోయాబ్ ను పెళ్లి చేసుకుంది.