Samantha Nandini Reddy Movie Sentiment: టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ ని బలంగా నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి సంఘటనలు రిపీట్ గా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి. రీసెంట్ గానే సమంత , నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలై డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి , ఇప్పుడు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించిన అతి తక్కువ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా చేరిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నందిని రెడ్డి తో కలిసి సినిమా చేసినప్పుడల్లా సమంత జీవితం లో జరిగిన కొన్ని కీలక మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్ , ఓ బేబీ, మా ఇంటి బంగారం చిత్రాలు వచ్చాయి.
జబర్దస్త్ చిత్రం లో సిద్దార్థ్ హీరో గా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి వరకు కూడా వెళ్ళింది , వీళ్ళ జాతకాల్లో దోషాలు ఉంటే పూజలు చేయించుకొని వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అయ్యింది. పెళ్లి దాకా వెళ్లిన వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇలా బ్రేకప్ అవ్వడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. ఇక సమంత , నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం ‘ఓ బేబీ’. ఇందులో ఆమె మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ చిత్రం విడుదలై , సూపర్ హిట్ అయిన రెండేళ్లకు కొన్ని అనుకోని కారణాల వల్ల సమంత , నాగ చైతన్య దంపతులు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు రాజ్ నిడిమోరు ని పెళ్లాడిన తర్వాత సమంత తో మరోసారి నందిని రెడ్డి సినిమా చేసింది. అంటే భవిష్యత్తులో సమంత మరో మూవీ నందిని రెడ్డి తో చేసేలోపు , మరోసారి విడాకులు తీసుకొని వేరొకరిని పెళ్లి చేసుకుంటుందా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత ప్రస్తుతం గర్భం దాల్చింది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కాబట్టి ఇప్పట్లో ఆమె సినిమాల్లో నటించే అవకాశం లేదు , భవిష్యత్తులో మరోసారి నందిని రెడ్డి తో చేసే అవకాశం కూడా లేదు కాబట్టి, వీళ్లిద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
