Salaar Movie part 2 : ప్రేక్షకులు చాలా రోజుల నుంచి భారీ అంచనాలు పెట్టుకున్న సలార్ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది. మూడు ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు అందులో భాగంగానే సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ గా తెరకెక్కింది.అయితే ఈ సినిమా పార్ట్ 2 కి జస్ట్ ఇంట్రడక్షన్ గా మాత్రమే వాడుకున్నట్టుగా తెలుస్తుంది…
అసలు కథ పార్ట్ 2 లో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పార్ట్ 1 సీజ్ ఫైర్ గా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ పార్ట్ 2 ని ‘శౌర్యంగ పర్వం’ అనే పేరుతో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.. అయితే పార్ట్ 1 లో దేవా (ప్రభాస్) క్యారెక్టర్ వరద రాజా మాన్నార్ (పృథ్వి రాజ్ సుకుమారన్) అనే తన ఫ్రెండుని కాపాడడానికి వచ్చినట్టుగా చూపించారు. అయితే వీరిద్దరి మధ్య కూడా శత్రుత్వం ఉంది అనేది క్లైమాక్స్ లో చూపించారు. వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం కలగడానికి గల కారణాలేంటి ప్రభాస్ ఎప్పుడు శృతిహాసన్ ని కాపాడుకుంటూ వస్తుంటాడు. అసలు ఆమెకి ఈయనకి సంబంధం ఏంటి..? అసలు ఇద్దరిలో ఎవరు ఆ రాజ్యానికి రాజు అవుతారు అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ రెండో పార్ట్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా మరో రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి అలాగే ప్రశాంత్ నీల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కమిట్ అయిన సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకురాబోతున్నట్టు గా తెలుస్తోంది.. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన సలార్ సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళుతోంది. ఒక్క రోజులోనే 36 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే మామూలు విషయం కాదు.
ఇంక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి… ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల కలక్షన్లు రాబడితే ప్రశాంత్ నీల్ వరుసగా రెండు సినిమాలతో 1000 కోట్ల కలక్షన్స్ ని రాబట్టిన డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.