https://oktelugu.com/

RGV Vyuham : ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి..పెద్ద రాజకీయ నాయకుడి భార్య.. ఎవరో గుర్తుపట్టారా?

సీఎం జగన్ గా రంగం సినిమా లో విలన్ గా చేసిన అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. గతం లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు' అనే సినిమాలో కూడా జగన్ పాత్రధారి ఇతనే. ఇక వ్యూహం లో నటిస్తున్న ఆర్టిస్టుల ఫోటోలను నేడు పరిచయం చేసాడు రామ్ గోపాల్ వర్మ. అందులో వై ఎస్ జగన్ కి భార్య 'భారతి' పాత్ర పోషించే అమ్మాయి ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2023 9:42 pm
    Follow us on

    RGV Vyuham : వివాదాలతో సంసారం చెయ్యడం అంటే రామ్ గోపాల్ వర్మ కి తెగ ఇష్టం. ఒకప్పుడు ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే దిగ్గజ దర్శకుడు.శివ , సర్కార్ , సత్య ఇలా ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీసి, ఇలాంటి షాట్స్ కూడా పెట్టొచ్చా?, ఇలా కూడా ఆలోచించొచ్చా?, అని మహామహులను సైతం ఆశ్చర్యపోయేలా చేసాడు ఆయన.

    అంత తెలివితేటలు పెట్టుకొని ఈరోజు ఆయన ఆ తెలివి తేటలను వివాదాలకు ఉపయోగిస్తూ ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచించే స్థాయికి దిగజారిపోయాడు. అందుకే ఈయనని ఈమధ్య జనాలు పట్టించుకోవడం మానేశారు. అంతకు ముందు కాస్తో కూస్తో కొద్దిగా మార్కెట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఆయన తీస్తున్న మరో వివాదాస్పద చిత్రం ‘వ్యూహం’. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని కారణజన్ముడు అని చెప్తూ, పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ని కరుడుగట్టిన విలన్స్ లాగ చూపించే ప్రయత్నమే ఈ ‘వ్యూహం’.

    ఈ సినిమా ప్రారంభానికి ముందు ఆయన జగన్ ని కలిసాడు ఆయన ఆదేశాల మేరకే ఈ వ్యూహాన్ని రచించాడు.అయితే ఈ చిత్రం లో సీఎం జగన్ గా రంగం సినిమా లో విలన్ గా చేసిన అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. గతం లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యం లో కడప రెడ్లు’ అనే సినిమాలో కూడా జగన్ పాత్రధారి ఇతనే. ఇక వ్యూహం లో నటిస్తున్న ఆర్టిస్టుల ఫోటోలను నేడు పరిచయం చేసాడు రామ్ గోపాల్ వర్మ. అందులో వై ఎస్ జగన్ కి భార్య ‘భారతి’ పాత్ర పోషించే అమ్మాయి ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు.

    ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి కానీ, ఇలా మనిషిని పోలిన మనుషులను పట్టడం లో రామ్ గోపాల్ వర్మ ని కొట్టేటోడు లేదు. ఇంత శ్రద్ద ఆయన విలువైన కాన్సెప్ట్స్ మీద పెట్టి ఉంటే, నేడు ఎన్నో గొప్ప సినిమాలను అందించేవాడు. భారతి పాత్ర పోసించిన అమ్మాయి పేరు ఏమిటో తెలియదు కానీ, ఈమెని చూసిన తర్వాత మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు అని మన పూర్వికులు చెప్పిన మాట నిజమే అని అనిపిస్తుంది.