Homeఎంటర్టైన్మెంట్Ram Charan Narendra Modi Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో రామ్ చరణ్...

Ram Charan Narendra Modi Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..

Ram Charan Narendra Modi Meeting: ‘పెద్ది’ మూవీ సక్సెస్ తో రామ్ చరణ్ పేరు నేషనల్ లెవెల్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నాడు , ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన పాటలు , ఆ సినిమాలోని డైలాగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ ట్రెండింగ్ లో ఉండగానే , మరోసారి ఆయన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాడు. నిన్న ముంబై లో జరిగిన ‘రిపబ్లిక్ సమ్మిట్ 2026’ ఈవెంట్ కి హాజరయ్యాడు. రామ్ చరణ్ తో పాటు దేశం లోని ప్రముఖులంతా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదే సమ్మిట్ లో రామ్ చరణ్ తో మీడియా ఇంటరాక్షన్ కూడా జరిగింది. ఈ సమ్మిట్ కి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని పవర్ ఫుల్ స్పీచ్ ని అందించాడు.

ఆయన సమ్మిట్ కి రాగానే రామ్ చరణ్ కి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం , అతని బాగోగులు అడిగి తెలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రధాని , రామ్ చరణ్ కలయిక ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంత ఆప్తుడు అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, దేశం మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అనుభందం ఉంది అనేది తెలుసు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేకపోతే, నేరుగా నరేంద్ర మోడీ నే ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళాడు , ఆ స్థాయి అనుబంధం వీళ్లిద్దరి మధ్య ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా మోడీ తో ఆప్యాయంగా మాట్లాడడం చూస్తుంటే , మెగా ఫ్యామిలీ నరేంద్ర మోడీ దృష్టిలో అత్యున్నత స్థాయిలో ఉందనే విషయం స్పష్టం అవుతోంది.

చిరంజీవి తో కూడా మోడీ అనేక సందర్భాల్లో ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం రోజున , చిరంజీవి ని దగ్గరకు తీసుకొని ఫోటో దిగిన సందర్భాన్ని మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు రామ్ చరణ్ తో మోడీ మీటింగ్ ని కూడా చాలా స్పెషల్ గా చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా లో వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే నేడు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ‘పెద్ది’ మూవీ విజయోత్సవ సభ జరగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version