Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Wears Pawan Kalyan Style: పవన్ కళ్యాణ్ 'ఓజీ' గెటప్ ని కాపీ కొట్టిన...

Rajinikanth Wears Pawan Kalyan Style: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గెటప్ ని కాపీ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్..వీడియో వైరల్!

Rajinikanth Wears Pawan Kalyan Style: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan) మల్టీస్టార్రర్ మూవీ గ్లింప్స్ వీడియో నే కనిపిస్తుంది. 40 ఏళ్ళ క్రితం వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోలు అయ్యాక బయట కలిసి కనిపించడమే కానీ, వెండితెర పై ఎప్పుడూ కలిసి కనిపించడం లేదు. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే సినిమాలో చూడాలని నేటి తరం ఆడియన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. డాక్టర్, బీస్ట్, జైలర్, జైలర్ 2 చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ టీజర్ లోని ఒక షాట్ లో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నడిచి వస్తున్న షాట్ బాగా హైలైట్ అవ్వగా, ఆ షాట్ లో రజిని వేసిన దుస్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది.

ఎందుకంటే ఆ దుస్తులు ‘ఓజీ'(They Call Him OG) చిత్రంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వేసుకున్న దుస్తులు లాగా అనిపించింది. పైన కోటు, లోపల షర్ట్, అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్ దుస్తులను కాపీ కొట్టారని సోషల్ మీడియా లో పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . ఓజీ చిత్రం లో పవన్ కళ్యాణ్ ముంబై మహానగరం లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లే సన్నివేశం ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఆ ఒక్క సన్నివేశం వల్ల ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటుంటారు. ఆ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ ధరించిన దుస్తులే, నేడు విడుదలైన గ్లింప్స్ వీడియో లో రజినీకాంత్ కూడా ధరించాడు. దీంతో అభిమానులు మా హీరో ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు అంటూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా రజినీకాంత్ ని తక్కువ చేయడం పై మండిపడుతున్నారు. ఒకే డ్రెస్ వేసుకున్నంత మాత్రానా ట్రెండ్ ఫాలో అయ్యినట్టు కాదు, ఆ మాటికొస్తే ఓజీ లాంటి చిత్రాలకు ప్రేరణ ‘బాషా’. అది లేకుండా ఇలాంటి సినిమాలు అసలు ఇప్పుడు ఉండేవి కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియా లో ఇరువురి హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. అయితే అంత పర్ఫెక్ట్ గా ఓజీ కాస్ట్యూమ్స్ రజిని కి ఎలా వచ్చాయి?, డైరెక్టర్ నెల్సన్ ఓజీ చిత్రాన్ని చూసి, ఆ సన్నివేశం లోని కాస్ట్యూమ్స్ నచ్చి కావాలని చేయించుకున్నాడా? లేదంటే యాదృచ్చికంగా ఆ కాస్ట్యూమ్ ని ఎంచుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version