Salaar – Rajamouli : ప్రభాస్ నటించిన సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు సలార్ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే సలార్ మూవీ రూ. 400 వందల కోట్లకుల పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఫ్యాన్స్ కోరుకున్నట్లు ప్రభాస్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా చూపించారు ప్రశాంత్ నీల్. సలార్ చిత్రానికి పెద్దగా ప్రచార కార్యక్రమాలు కూడా జరగలేదు.
బహుశా ప్రభాస్ కాలికి సర్జరీ కావడం వల్లే అనే ప్రచారం జరుగుతుంది. నార్త్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతుంది. సలార్ ప్రమోషన్స్ లో దర్శకధీరుడు రాజమౌళి కూడా భాగం అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ లను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని జోస్యం చెప్పారు. అనుకున్నట్లే సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుంది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయి మూడు రోజులు గడుస్తున్నా ఇంతవరకు జక్కన్న నుంచి ఒక్క ట్వీట్ కూడా రాకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజమౌళి, ప్రభాస్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఒక మంచి హిట్ వస్తే దానిపై కూడా రాజమౌళి స్పందించకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి లాంటి వారు సైతం సలార్ చిత్రానికి రివ్యూ ఇచ్చారు.
మరి రాజమౌళి ఎందుకు నోరు విప్పలేదు. రాజమౌళి సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ సలార్ మూవీ ఎలా ఉందో చెప్పలేదు. దీంతో రాజమౌళికి సలార్ నచ్చలేదేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. రాజమౌళి వంటి డైరెక్టర్ ఒక పాజిటివ్ ట్వీట్ వేస్తే చాలా సపోర్ట్ అవుతుంది. చూడాలి ఇకనైనా రాజమౌళి కామెంట్ చేస్తారేమో లేదో. సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.