Pushpa 3 Story: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ‘పుష్ప’ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా మారిపోయింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్యారెక్టర్ పై ఎన్ని సినిమాలు తీసినా ఆడియన్స్ సూపర్ హిట్ చేసేలా ఉన్నారు. అందుకే మేకర్స్ కూడా ఈ ఫ్రాంచైజ్ ని వదలాలని అనుకోవడం లేదు. ‘పుష్ప 2’ మూవీ చివర్లో ‘పుష్ప 3 : ది ర్యాంపేజ్’ అనే టైటిల్ పడుతుంది. అది ఎదో అభిమానులను సంతృప్తి పర్చడానికి వేసిన టైటిల్ కాదు. నిజంగానే ‘పుష్ప 3’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కథ ని సిద్ధం చేయడానికి రైటింగ్ టీం పని కూడా మొదలు పెట్టిందని, అందుకోసం మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
‘పుష్ప 3’ లో అల్లు అర్జున్ కి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడట. ఎవరికీ తలవంచని ‘పుష్ప’ ఆ గాడ్ ఫాదర్ ముందు మాత్రం తలవంచుతాడట. ఇంతకీ ఆ గాడ్ ఫాదర్ మరెవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నారట. ఇందులో సల్మాన్ ఖాన్ బిలినియర్ గా, మాస్టర్ మైండ్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ క్యారెక్టర్ ని ‘పుష్ప 3’ లో అల్లు అర్జున్ కి గాడ్ ఫాదర్ లాగా పరిచయం చేయబోతున్నారట. ఇందులో కేవలం అతిథి పాత్ర లాగా కనిపించే సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ తో పూర్తి స్థాయి సినిమాని కూడా చేయడానికి సిద్ధం గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.
ఇదంతా పక్కన పెడితే ప్రతీ చోట ‘తగ్గేదేలే’ అనే యాటిట్యూడ్ తో, ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత తెలివితేటలూ , తన సొంత కష్టం మీద ఎర్రచందనం సిండికేట్ కి కింగ్ లాగా నిల్చిన పుష్ప, ఒక మనిషిని గాడ్ ఫాదర్ లాగా కొలుస్తూ, అతనికి తలవంచడానికి కారణమైన పరిస్థితి ఏంటి?, ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో బాంబు బ్లాస్ట్ లో పుష్ప ని, పుష్ప ఫ్యామిలీ ని మొత్తం చంపేసినట్టు చూపిస్తారు. ఆ బాంబు బ్లాస్ట్ నుండి పుష్ప ని, శ్రీవల్లి ని సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ రక్షిస్తుందా?, అందుకే పుష్ప అతన్ని గాడ్ ఫాదర్ లాగా చూస్తున్నాడా? వంటి అంశాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎలా తీర్చి దిద్దబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం.