https://oktelugu.com/

Prabhas – Salaar : ‘సలార్’ టీం కి గుడ్ బాయ్ చెప్పేసిన ప్రభాస్..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్ రెడీ!

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ఈరోజు.. రేపటితో పూర్తి కానుంది. జూన్ 16 వ తేదీన టీజర్ విడుదల చేయబోతుంది మూవీ టీం,ఈ టీజర్ ఆదిపురుష్ సినిమాకి కూడా అటాచ్ చేసి థియేటర్స్ లో ప్లే అయ్యే విధంగా చేస్తారట

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2023 / 09:28 PM IST
    Follow us on

    Prabhas – Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ లో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకర్షిస్తున్న చిత్రం ‘సలార్’. KGF సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ఓవర్సీస్ ప్రాంతం లోనే వంద కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయింది.

    ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం నైజాం ప్రాంతం లోనే 80 కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తుంది. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప, కనీసం టీజర్ కూడా విడుదల కానీ ఒక సినిమా ఈ స్థాయిలో బిజినెస్ చెయ్యడం ఇది వరకు ఎప్పుడు జరుగలేదు. ప్రభాస్ స్టార్ స్టేటస్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విడుదలకు ముందే ఈ రేంజ్ బిజినెస్ చేస్తే ఇక విడుదల తర్వాత ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ఈరోజు.. రేపటితో పూర్తి కానుంది. జూన్ 16 వ తేదీన టీజర్ విడుదల చేయబోతోంది మూవీ టీం. ఈ టీజర్ ఆదిపురుష్ సినిమాకి కూడా అటాచ్ చేసి థియేటర్స్ లో ప్లే అయ్యే విధంగా చేస్తారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకి రానుంది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది మూవీ టీం.

    శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించగా, మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో మాస్ సినిమాలు చేసాడు కానీ, ఇలాంటి మాస్ సినిమా ఇప్పటి వరకు ఆయన చెయ్యలేదని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇలాంటి మాస్ సినిమా ఇప్పటి వరకు రాలేదని మూవీ టీం చెప్తుంది.