Highest paid Heroine : హీరోలదేముంది.. వందల కోట్ల రెమ్యూనరేషన్.. లాభాల్లో వాటాలు.. పంపిణీ హక్కులు.. ఇంకా చాలా నజరానాలు.. ఇవన్నీ తీస్తే నిర్మాతకు మిగిలేది హల్లికి హల్లి, సున్నాకు సున్నా. హీరో విషయంలో అంత ఉదారత చూపే నిర్మాతలు.. హీరోయిన్ విషయంలో చూపరు. పైగా హీరోయిన్ అంగాంగ ప్రదర్శన చేయాలి. అవసరమైతే టూ పీస్ *** లో కనిపించాలి. ఇంతా చేస్తే.. ఒళ్ళు దాచుకోకుండా నటిస్తే.. వచ్చేది అంతంతే. అయితే ఇలాంటి హీరోయిన్ల కేటగిరీలో ఒక నటి ఇండియాలోనే టాప్ పెయిడ్ గా కొనసాగుతోంది. మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. నేషనల్ క్రష్మిక అంటూ అన్ని పరిశ్రమలూ రష్మిక వెంట పడుతుంటే.. ఆమె మాత్రం సైలెంట్ గా అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన హీరోయిన్ గా నిలుస్తోంది.
ఓం శాంతి ఓం సినిమా ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించిన దీపిక పడుకొనే.. ఎన్నో అద్భుతమైన పాత్రల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. అంతేకాదు గత 8 సంవత్సరాల నుంచి ఏడాదికి 10 కోట్లకు తగ్గకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తోంది. దీపిక పేరు మీద ప్రస్తుతం 500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ప్రతి సినిమాకు తన పాత్ర డిమాండ్ ను బట్టి 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది. అంతేకాకుండా కార్పొరేట్ యాడ్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కూడా దండిగా సంపాదిస్తోంది. ఇంతటి ఆదాయం ఉన్న నేపథ్యంలో ఏడాదికి 10 కోట్లను ఆదాయపు పన్నుగా చెల్లిస్తోంది. నేషనల్ క్రష్మికగా పేరుపొందిన రష్మిక సైతం ఈ స్థాయిలో ఐటీ చెల్లించడం లేదు.
దీపిక తర్వాత ఆలియా భట్ తర్వాత స్థానంలో ఉంది. ఆమె ఏడాదికి ఐదు నుంచి 6 కోట్ల రూపాయలను ఆదాయపు పన్నుగా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఆలియా కెరియర్ కూడా అద్భుతంగా ఉంది. పలు అంతర్జాతీయ కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నాయి. ఫలితంగా ఆమె సంపాదన విపరీతంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె ఏడాదికి ఐదు కోట్ల వరకు ఆదాయపు పన్ను చెల్లిస్తోందని సమాచారం. ఆలియా తర్వాత స్థానంలో కత్రినా కైఫ్ ఉంది. 10 సంవత్సరాల క్రితం కత్రినా కైఫ్ ఐటీ చెల్లింపులో మొదటి స్థానంలో ఉండేది. అప్పట్లో ఆమె కెరియర్ కూడా అద్భుతంగా ఉండేది. గూగుల్ సెర్చ్ లోనూ మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత కత్రినా స్థానాన్ని దీపిక ఆక్రమించింది. ఇక ప్రస్తుతం కత్రినా ఏడాదికి మూడు కోట్ల వరకు ఆదాయపు పన్ను చెల్లిస్తోంది. ఇక హీరోలు విభాగంలో అక్షయ్ కుమార్ అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. ఏడాదికి 25 కోట్ల దాకా అక్షయ్ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. ఒక్కో సినిమాకి 70 నుంచి 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఎంత ఐటీ చెల్లిస్తున్నారనే వివరాలు తెలియ రాలేదు.