https://oktelugu.com/

Samantha- Naga Chaitanya: విడాకుల రద్దు పై సంచలన ప్రకటన చేయబోతున్న నాగ చైతన్య – సమంత..?

Samantha- Naga Chaitanya:  సుమారు 7 ఏళ్ళ పాటు ప్రేమించుకొని 5 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న సమంత – నాగ చైతన్య ఏడాది క్రితం విడాకులు తీసుకున్న సంఘటన అభిమానులు, ప్రేక్షకులను ఎంతలా బాధించిందో మన అందరికి తెలిసిందే.. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపించేంత ప్రేమని చూపించుకుని వీళ్లిద్దరు విడిపోయారు. దీన్ని అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.. అయితే గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఈ జంట […]

Written By: , Updated On : November 16, 2022 / 05:01 PM IST
Follow us on

Samantha- Naga Chaitanya:  సుమారు 7 ఏళ్ళ పాటు ప్రేమించుకొని 5 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న సమంత – నాగ చైతన్య ఏడాది క్రితం విడాకులు తీసుకున్న సంఘటన అభిమానులు, ప్రేక్షకులను ఎంతలా బాధించిందో మన అందరికి తెలిసిందే.. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపించేంత ప్రేమని చూపించుకుని వీళ్లిద్దరు విడిపోయారు. దీన్ని అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.. అయితే గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఈ జంట అభిమానులకు కాస్త ఊరట కలిగించేలా చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. త్వరలోనే వీళ్లిద్దరు తమ విడాకులు రద్దు చేసుకోబోతున్నట్టు ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తున్న టాక్.. కొన్నేళ్ల నుండి సమంత ‘మయోసిటిస్’ అనే వ్యాధితో బాధపడుతూ ఉండగా.. ఇప్పుడు అది తీవ్రరూపం దాల్చడం తో చికిత్స తీసుకుంటుంది..సోషల్ మీడియా సాక్షిగా సమంతకి అభిమానులతో పాటుగా సెలెబ్రిటీలు కూడా త్వరగా కోలుకోవాలని ఆమె పోస్టు క్రింద కామెంట్స్ పెట్టారు.. వారిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు.

కానీ అక్కినేని నాగార్జున నుండి కానీ.. నాగ చైతన్య నుండి కానీ అసలు ఏ మాత్రం రెస్పాన్స్ రాలేదు.. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నాగ చైతన్య ఇటీవలే సమంత ని కలిసాడని.. కలిసి ఆమెకి ధైర్యం చెప్పాడని వార్తలు వచ్చాయి.. మరో విశేషం ఏమిటంటే సమంత చికిత్స మొత్తాన్ని కూడా అక్కినేని కుటుంబమే స్వయంగా పర్యవేక్షిస్తుందట.. నాగార్జున ఎప్పటికప్పుడు సమంత ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుండి సమాచారం తీసుకుంటున్నాడట.

నాగ చైతన్య కూడా ఇటీవలే పలుమార్లు సమంతని కలిసాడు..ఈ క్రమం లోనే వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు సర్దుకున్నాయని.. ఇక కాంప్రమైజ్ అయ్యి కలిసి జీవిద్దామని నాగ చైతన్య ప్రతిపాదించడంతో సమంత కూడా అందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే వీళ్లిద్దరి రీ యూనియన్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి.. వీళ్లిద్దరు కలవడం కలలో కూడా సాధ్యపడదు అని అభిమానులు నిరాశ చెందుతున్న సమయం లో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలవబోతున్నారు అని వార్త రావడం తో ఫాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. దీనిపై అటు సమంత కానీ.. ఇటు చైతన్య కానీ అధికారికంగా స్పందించలేదు.