Naga Chaitanya: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు దాటింది , ఇప్పటి వరకు అఖిల్ కి ఆడియన్స్ నుండి ఈ రేంజ్ పబ్లిక్ టాక్ ఉన్నటువంటి సినిమా రాలేదు. మొదటిసారి అలాంటి చిత్రం రావడంతో , బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఓపెనింగ్స్ ని చూసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఇన్నేళ్లు వృధా అయినా అఖిల్ స్టామినా తలచుకొని బాధపడుతున్నారు. ఈ రేంజ్ స్టామినా పెట్టుకొని కూడా అఖిల్ మంచి సినిమాలు చేయలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈ సినిమా పై అక్కినేని నాగచైతన్య వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
నిన్న సాయంత్రం ఆయన ఒక ట్వీట్ వేస్తూ , ‘కష్టపడితే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి లెనిన్ ఒక నిదర్శనం. ఈ చిత్రానికి వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా తమ్ముడి అద్భుతమైన నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యినందుకు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ ఒక ట్వీట్ వేశారు నాగ చైతన్య. దీనికి అఖిల్ సమాధానం చెప్తూ ‘థాంక్యూ అన్నయ్యా.. మీకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఆనందం తో కంటతడి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అఖిల్ , నాగ చైతన్య మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని చాలా రోజుల నుండి ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉంది. అంతే కాదు , ఈ ఇద్దరి హీరోల అభిమానులు నిత్యం సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ కూడా చేసుకుంటూ ఉంటారు.
ఇక నిన్న సక్సె సెలబ్రేషన్స్ లో నాగ చైతన్య కనిపించకపోయేసరికి , అక్కినేని ఫ్యాన్స్ నిజంగానే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయేమో అని అనుకున్నారు. కానీ నేడు ట్వీట్స్ రూపం లో వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాత చూసిన తర్వాత అభిమానులు అవన్నీ రూమర్స్ ని ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే లెనిన్ చిత్రానికి మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.
My brother
Thank you so much ❤️❤️ I hope you like the film https://t.co/NQu1drMD8M
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 10, 2026
