Naa Anveshana On Garikapati Narasimha Rao: సమాజం లో ఏదైనా మనకి ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు దానిని వ్యతిరేకించడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ నోటికి హద్దు, అదుపు ఉండాలి, అది లేకుండా ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడితే చూసే వాళ్లకు చాలా చిరాకు కలుగుతుంది. ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ ‘ అదే చేస్తున్నాడు. ఇతను ఇండియా కి వస్తే చితకకొట్టడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ రేంజ్ లో అందరినీ గెలికేసి ఉన్నాడు. ఇతను వాడే పదాలు వింటే చెవుల్లో నుండి రక్తం రావాల్సిందే. రీసెంట్ గానే శివాజీ హీరోయిన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్స్ ఈవెంట్స్ కి వెళ్ళేటప్పుడు చక్కగా చీర కట్టుకొని వెళ్ళండి, సామాన్లు కనిపించేలా పొట్టి దుస్తుల్ ఎలాంటి అందం ఉండదు అంటూ కామెంట్స్ చేసాడు. ఆ తర్వాత సమన్లు అనే పదం ఉపయోగించినందుకు శివాజీ క్షమాపణలు కూడా చెప్పాడు.
అదే విధంగా గరికపాటి కూడా శివాజీ కామెంట్స్ పై స్పందిస్తూ ‘అతను కరెక్ట్ గానే మాట్లాడాడు కదా. పొట్టి దుస్తులు ధరించే అమ్మాయిలను చూస్తే నా వయస్సులో ఉన్నవాళ్లే రెచ్చిపోతుంటారు, ఇక 17 , 18 ఏళ్ళ వయస్సు ఉన్నవాళ్లు ఎందుకు ఆగుతారు’ అని అంటాడు. వీళ్లిద్దరికీ కౌంటర్లు నా అన్వేషణ అనే వ్యక్తి పచ్చి సంస్కృత బాషా వాడుతూ తిట్టిన తిట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మీకూ, ఆ శివాజీ కి అమ్మాయిలు వేసుకునే బట్టలు చూసి రెచ్చిపోయే పరిస్థితి వస్తే, మీది కట్ చేసేసుకోండి’ అంటూ చాలా దారుణమైన బాషా మాట్లాడుతూ తిట్టాడు. ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఈ క్రింది వీడియో లో చూడండి. వీడియో చూసే ముందు హెడ్ ఫోన్స్ ధరించడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ రేంజ్ సంస్కృత బాషాని ఉపయోగించాడు.
మరోపక్క గరికపాటి లాంటి ఉన్నతమైన మనిషి మీద ఇలాంటి కామెంట్స్ చేస్తావా అంటూ, గరికపాటి అభిమానులు సోషల్ మీడియా లో నా అన్వేషణ పై విరుచుకుపడుతున్నారు. అక్కడెక్కడో ఉంటూ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం కాదు , ఇండియా కి రా నీ సంగతి మేము చూసుకుంటాం అంటూ మండిపడుతున్నారు. ప్రపంచ యాత్రికుడిగా ‘నా అన్వేషణ’ కి సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి వంటి ప్రముఖులు కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ప్రపంచం లో ప్రతీ మూలని ఆయన చుట్టేశాడు . ప్రతీ దేశం లోనూ జనాల నాగరికత , వాళ్ళ దేశ సంస్కృతి ని ఆడియన్స్ కి తెలిపే ప్రయత్నం చేసాడు. అందుకు ఆయన పై ఆడియన్స్ లో చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇప్పుడు ఆయన ఇలాంటి బాషా మాట్లాడడం చూసి తనకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
