Mohan Babu Paradise Entry Scene: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే చాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది. కారణమేంటి అంటే మన స్టార్ హీరోలు వాళ్ళు చేసిన ప్రతి సినిమాను సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో మన హీరోలను మించిన వారు మరెవరు లేరనెంతలా పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న స్టార్ హీరోలు సైతం భారీ లెవెల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాని లాంటి స్టార్ హీరోలు సైతం మాస్ జపం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు విలన్ గా నటిస్తుండటం విశేషం… ఒకప్పుడు మోహన్ బాబు విలనిజాన్ని టాప్ లెవల్లో చూపించాడు. ఆ తర్వాత తను హీరోగా మారాడు. ప్రస్తుతం మరోసారి విలన్ అవతారం ఎత్తాడు స్ట్రాంగ్ విలన్ ఎలా ఉంటాడు.
Also Read: పవన్ కళ్యాణ్ – మహేష్ కాంబోలో మిస్ అయిన మూవీ…వర్కౌట్ అయితే ‘త్రిబుల్ ఆర్ ‘ కంటే వైల్డ్ గా ఉండేదా..?
తను ఎలా ఉంటే ప్రేక్షకులను మెప్పించగలుగుతాడు. అనే ఒక యాంగిల్ లో ఆలోచించి ఒక డిఫరెంట్ పాత్ర దొరికినప్పుడు దానిని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే మోహన్ బాబు ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే సినిమాను సైతం నెక్స్ట్ లెవల్లో నిలుపుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటివరకు మోహన్ బాబు చేసిన పాత్రలన్నింటి కంటే ఈ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందట. ఇక మోహన్ బాబు ఎంట్రీ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. ఒక వందమంది లో మోహన్ బాబు బ్లడ్ బాత్ చేసినట్టుగా రక్తం తో తడిచిపోయి షర్ట్ లేకుండా నడుచుకుంటూ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అలాంటి ఒక భారీ ఇంట్రాడక్షన్ సీన్ ప్లాన్ చేశారట.
ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఈ సినిమాతో మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలుపబోతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది…
