Mardaani 3 Trailer Review: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ(Rani Mukherjee) ప్రధాన పాత్రలో ‘మారదాని 3′(Maradhani 3 Trailer) పై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గతం లో ఈ సిరీస్ నుండి రెండు సూపర్ హిట్ సినిమాలు రావడం తో , ఆ ఫ్రాంచైజ్ నుండి వస్తున్న మూడవ సినిమా పై కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన యాష్ రాజ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అభిరాజ్ మినవాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. ఇందులో రాణి ముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ లో కనిపించింది.
ట్రైలర్ ని చూసిన తర్వాత ఈ సినిమా స్టోరీ గురించి అర్థం అయ్యింది ఏమిటంటే, ప్రతీ వారం వందల సంఖ్యలో చిన్న పిల్లలు అదృశ్యం అవుతూ ఉంటారు. వీళ్ళని అలా అదృశ్యం అయ్యేలా చేస్తున్న ముఠాని కనిపెట్టే క్యారెక్టర్ లో ఇందులో రాణి ముఖర్జీ నటించినట్టు తెలుస్తోంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇప్పటికే మనం చాలా చూసేసాము. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ఈమధ్య కాలం లో అవుట్ రైట్ గా రిజెక్ట్ చేస్తున్నారు. కచ్చితంగా కొత్తదనం ఉండాల్సిందే. అయితే రొటీన్ స్టోరీ లైన్ అయినప్పటికీ, ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా థ్రిల్ కి గురి చేసే విధంగా తీయొచ్చు. అలా తీసుంటే మాత్రం ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే చెప్పాలి. అసలే ఇప్పుడు బాలీవుడ్ లో కంటెంట్ రాజ్యం ఏలుతుంది. కేవలం ఖాన్స్ మాత్రమే వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే రోజులు పోయాయి.
ఇప్పుడు కంటెంట్ ఉంటే లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా, యంగ్ హీరో సినిమా అయినా బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణలు స్త్రీ 2, దురంధర్. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా ఈ సినిమాలు సృష్టించిన బాక్స్ ఆఫీస్ విద్వంసాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ‘మరదాని 3’ కి కూడా అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని ఎలా మ్యానేజ్ చేసాడో చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.
