Mana Shankara Varaprasad Review : తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ గత 50 సంవత్సరాలుగా మెగాస్టార్ గా వెలుగొందుతున్న నటుడు చిరంజీవి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా యావత్ తెలుగు ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు రిలీజ్ అయింది… కానీ నిన్న నైట్ నుంచే ఈ సినిమాకి ప్రీమియర్ వేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
శంకర వరప్రసాద్ (చిరంజీవి), శశిరేఖ (నయనతార) ఇద్దరు ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు…ఇక ఈ పెళ్లి ప్రముఖ బిజినెస్ మ్యాన్ శశి రేఖ ఫాదర్ అయిన జీవిఆర్(సచిన్ కేడ్కర్) కి నచ్చదు. దాంతో వాళ్లిద్దరి మధ్య దూరం పెంచి వాళ్ళు విడాకులు తీసుకునేలా చేస్తాడు. ఇక అప్పటికే వాళ్ళకి ఒక పాప, బాబు ఉంటారు…ఇక శశిరేఖ నుంచి విడిపోయిన తర్వాత శంకర వరప్రసాద్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తాడు.
అక్కడ సెంట్రల్ మినిస్టర్ ను కాపాడటంతో ఆ మినిస్టర్ శంకర వరప్రసాద్ యొక్క గతం తెలుసుకొని మళ్ళీ శంకర వరప్రసాద్ తన ఫ్యామిలీ తో కలవడానికి హెల్ప్ చేస్తాడు… శంకర వరప్రసాద్ తన భార్య అయిన శశి రేఖ ను కలవాలంటే ముందు పిల్లల్ని దగ్గర చేసుకోవాలని పిల్లలు చదువుకునే స్కూల్లో పీఈటీ సార్ గా జైన్ అవుతాడు…
అక్కడ సార్ గా పిల్లల్ని తన రూట్ లోకి తెచ్చుకుంటాడు. సరిగ్గా అప్పుడే శశిరేఖ ఫాదర్ అయిన జీవిఆర్ మీద ఎటాక్ జరుగుతోంది. అప్పుడు తనకి సెంట్రల్ నుంచి సెక్యూరిటీ కావాలని కోరగా శంకర వరప్రసాద్ వాళ్ల ఇంట్లోకి అడుగుపెడతాడు… ఇక ఫైనల్ గా జీవీఆర్ మీద ఎటాక్ చేసినవాళ్లు ఎవరు? శంకర వరప్రసాద్ తన భార్య మనసు గెలుచుకొని మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారా..? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
అనిల్ రావిపూడి సినిమా అనగానే సినిమాలో పెద్దగా స్టోరీ అయితే ఉండదనే విషయం మనందరికి తెలిసిందే. మరోసారి శంకర వర ప్రసాద్ సినిమాలో సైతం ఎగ్జైట్ అయ్యే స్టోరీ ఏమీ ఉండదు. రొటీన్ స్టోరీ నే నమ్ముకుని బరిలోకి దిగాడు. చిరంజీవి మ్యానరిజమ్స్ తో మ్యాజిక్ చేయాలనే ప్రయత్నం చేశాడు. ఇక ఫస్టాప్ ఎక్కడ బోరింగ్ లేకుండా ఎంగేజింగ్ నడిపిన అనిల్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంతవరకు తడబడ్డాడు. అంతకంతకు కామెడీ తగ్గిపోవడం, ఒకే ఇంట్లో సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేయడం వల్ల అక్కడక్కడ బోర్ కలిగించింది…
చిరంజీవిని పూర్తిస్థాయిలో వాడుకోలేదని అనిపించింది. మెగాస్టార్ లోని వింటేజ్ చిరంజీవిని చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అందులో 100% సక్సెస్ కాలేదనే చెప్పాలి… గత సినిమాల మాదిరిగానే రొటీన్ కామెడీని నమ్ముకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకుముందు వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే బెటర్ గా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది.చిరంజీవీ లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ను చాలా ఎంగేజింగ్ గా నడిపించాలి. కానీ మనోడు మాత్రం లైట్ వెయిట్ తో తీసుకెళ్లాడు.
కారణం ఏంటి అంటే కథలో కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోవడం అలాగే అతను కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అని అనుకున్నాడు తప్పితే అది కామెడీ గా జన్రేత్ అవ్వలేదు… కొన్ని సీన్స్ స్క్రీన్ మీద చూస్తుంటే యాక్టర్స్ చేసే యాక్టింగ్ కి ఇరిటేషన్ వచ్చింది… చిరంజీవి ఇంట్రాడక్షన్ బావుంది. ఆ ఫైట్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. చిరంజీవి పొటెన్షియాలిటిని చూపించడానికి కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది… ఇక సంక్రాంతి వస్తున్నాం ఫేమ్ బుల్లి రాజు తో ఫస్టాఫ్ లో కొంత కామెడీ చేయించాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అది చూస్తున్నంత సేపు నవ్వు రాకపోగా ఆ సన్నివేశాలన్నీ చిరాకు కలిగించాయి… సెకండాఫ్ లో వచ్చే వెంకీ క్యామియో సైతం అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.
ఏదో కావాలనే తన క్యారెక్టర్ ను ఇన్వాల్వ్ చేసినట్టుంది. కానీ కథలో నుంచి మాత్రం ఆ క్యామియో రాలేదనే చెప్పాలి. వెంకీ క్యామియోతో దర్శకుడు సినిమా కథ మీద ఫోకస్ చేయకుండా ఆయన కోసం రాసుకున్న సీన్స్ మీద ఫోకస్ చేశాడు. దాన్ని కామెడీతో తీర్చి దిద్దే ప్రాసెస్ లో సినిమా కథ చాలావరకు సైడ్ ట్రాక్ పట్టింది…అందుకే సినిమా గాడి తప్పింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. ప్రతి సీన్లో అతను కనిపిస్తూ నటించడానికి ప్రయత్నం అయితే చేశాడు. కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగా పండితే మరికొన్ని సన్నివేశాల్లో కామెడీ పంచులు పేలలేదు. అయినప్పటికీ చిరంజీవి మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు… ఇక నయనతార సైతం తన పాత్రలో సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. సచిన్ కేడ్కర్ సైతం బిజినెస్ మేన్ ఎలా ఉంటాడో పర్ఫెక్ట్ అలాంటి పాత్రను పోట్రే చేశాడు… ఇక చిరంజీవి గ్యాంగ్ లో ఉన్న హర్షవర్ధన్, అభినవ్ గోమటం, కేథరిన్ సైతం మెప్పించారు… మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు…
టెక్నికల్ అంశాలు…
ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎలివేట్ అయింది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రాడక్షన్ లో వచ్చిన బిజీయం బాగుంది. వెంకటేష్ ఎంట్రీ అప్పుడు వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా సెట్ అయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సైతం భీమ్స్ చాలా వరకు ఫ్రెష్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నం చేశాడు… ఇక కొరియోగ్రాఫర్స్ సైతం చిరంజీవిని స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. కొన్ని డాన్స్ మూమెంట్లతో మెగాస్టార్ లోని గ్రేస్ ను మరోసారి పరిచయం చేశారు. ఇక హుక్ స్టెప్ సాంగ్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది…
ఈ మూవీలో బాగున్నవి
చిరంజీవి యాక్టింగ్
మ్యూజిక్
హుక్ స్టెప్ సాంగ్ మీద డ్యాన్స్…
ఈ మూవీలో బాగోలేనివి
రొటీన్ స్టోరీ
కామెడీ పెద్దగా లేదు…
ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి…
రేటింగ్ : 2.25/5
చివరి లైన్ : ఫ్యామిలీ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి ఈ సినిమా చూడచ్చు…
