https://oktelugu.com/

Trivikram-Mahesh: త్రివిక్రమ్ బడ్జెట్ పై మహేష్ ఆంక్షలు !

Trivikram-Mahesh: త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు. త్రివిక్రమ్ ఇచ్చిన బడ్జెట్ మరీ ఎక్కువ ఉంది అని మహేషే ఆలోచనలో పడ్డాడు. కారణం.. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 30, 2021 4:18 pm
    Follow us on

    Trivikram-Mahesh: త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు. త్రివిక్రమ్ ఇచ్చిన బడ్జెట్ మరీ ఎక్కువ ఉంది అని మహేషే ఆలోచనలో పడ్డాడు.

    Trivikram-Mahesh

    Trivikram-Mahesh

    కారణం.. మహేష్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. అందుకే, మహేష్ బడ్జెట్ విషయంలో కాస్త వెనకాముందు ఆలోచిస్తున్నాడట. నిజానికి మహేష్ కి హిందీలో మార్కెట్ లేదు. అలాగే త్రివిక్రమ్ కి కూడా హిందీలో మార్కెట్ లేదు. మరి పాన్ ఇండియా బడ్జెట్ పెట్టి సినిమా చేస్తే.. హిందీలో ఎంతవరకు మార్కెట్ అవుతుంది అనేదే డౌట్.

    అందుకే, బడ్జెట్ ను ఓవర్ గా పెట్టకపోవడమే మంచిది అని మహేష్ నిర్మాతలకు చెబుతున్నాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా బడ్జెట్ లేకపోతే వర్కౌట్ కాదు అని 160 కోట్లు బడ్జెట్ తప్పనిసరి అని షరతు పెట్టాడట. నిజానికి ఈ బడ్జెట్ విషయం పై గత రెండు నెలల నుంచి చర్చ జరుగుతూనే ఉంది.

    కచ్చితంగా బడ్జెట్ ఉండాల్సిందే అంటూ త్రివిక్రమ్, ఓవర్ బడ్జెట్ అయితే రిస్క్ అంటూ మహేష్ మొత్తానికి ఇలా చర్చ సాగుతూనే ఉంది. మధ్యలో నిర్మాత చినబాబు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పూర్తి అయింది. బడ్జెట్ పై కూడా ఫైనల్ అయితే, షూటింగ్ ను ప్లాన్ చేసుకోవాలనేది నిర్మాత ఆలోచన.

    Also Read: మహేష్ బాబు ఈ తప్పటడుగు వేస్తారా?

    కానీ, బడ్జెట్ ఫైనల్ కావాలి అంటే.. మహేష్ – త్రివిక్రమ్ ఇద్దరూ కూర్చుని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్రివిక్రమ్ మాత్రం భారీ బడ్జెట్ లేనిది సినిమా చేయలేడు. మరి ఏమవుతుందో చూడాలి. మరోపక్క సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ కొన్ని ట్యూన్స్ ను కూడా ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ విషయానికి వస్తే.. రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని మలచాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక రాజకీయ పాత్రను రాశాడు. సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: ఈ శుక్రవారం డిసెంబర్ 31న విడుదలయ్యే 7 సినిమాలు.. వాటి రివ్యూ!

    Tags