Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు… ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక మాస్ ఎలిమెంట్ ఉండే విధంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమైన ఆయన ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది చూడాలని అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన వారణాసి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఈ సినిమా కోసం ఎదురుచూడాల్సిందే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రను పోషించాడు. ఇక తాను చేయాల్సిన పాత్రలు మరికొన్ని ఉన్నాయని వాటికోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నానని కూడా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ ను సైతం ఇండస్ట్రీకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. గౌతమ్ కృష్ణ కి ఇప్పటికే యాక్టింగ్ కి సంబంధించిన శిక్షణను ఇప్పిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక అదే ఇప్పటికే ఒక ముగ్గురు దర్శకులు గౌతమ్ కృష్ణ ఇమేజ్ కి సరిపడా కథను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అజయ్ భూపతి లాంటి దర్శకుడు మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. తన దగ్గర కూడా గౌతమ్ కృష్ణకు సరిపడా ఒక కథ రెడీగా ఉందట.
ఇక తనతో పాటుగా తమిళ్ డైరెక్టర్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం మహేష్ బాబు కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తనకు అప్పజెప్పాలని మహేష్ బాబుతో మంతనాలు జరుపుతున్నాడు. ఇక వీళ్లతో పాటుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న బుచ్చిబాబు లాంటి దర్శకుడు సైతం మహేష్ బాబు కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.
ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన 2 సినిమాలు మంచి విజయాలను సాధించాయి. మొదటిది ఉప్పెన సినిమా కాగా మరొకటి పెద్ది సినిమా కావడం విశేషం…రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. కాబట్టి తను కూడా మహేష్ బాబు కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి…

