Mahesh Babu Puri Conflict: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు… వల్ల ఫాదర్ అయిన కృష్ణ గారి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు…ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మహేష్ బాబు కెరియర్ మొదట్లో మంచి సినిమాలు చేస్తూ వచ్చినప్పటికి ఆయనకు కమర్షియల్ గా స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. పోకిరి సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన మహేష్ బాబు నెంబర్ వన్ పొజిషన్ ని అందుకున్నాడు. అప్పటి తరంలో ఉన్న హీరోలందరిలో తను ముందు వరుసలో ఉండడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను తిరుగులేని నటుడిగా ఎదిగాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్ని అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి… పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన బిజినెస్ మేన్ సినిమా కూడా అతనికి ఒక గొప్ప ఘన కీర్తిని తీసుకొచ్చి పెట్టింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుని చాలా ప్రత్యేకంగా చూడడం స్టార్ట్ చేశారు. బిజినెస్ మేన్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అంటే మహేష్ బాబు తన నటనతో విలయ తాండవం చేశారనే చెప్పాలి. మరి ఇలాంటి మహేష్ బాబు పూరి జగన్నాథ్ ల మధ్య ఎందుకని వైరుధ్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఎందుకని విడిపోయి ఎవరికి వారు సినిమాలు చేసుకుంటున్నారు. వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడడానికి మహేష్ బాబు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఎందుకని వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు. అనే ధోరణి లో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
Also Read: రామ్ చరణ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుకి పూరి జగన్నాథ్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. దానివల్లనే ఒకరికి ఒకరు మాట్లాడుకుండా దూరమవుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి కారణం ఏంటంటే పూరి జగన్నాథ్ చెప్పిన కథ పెద్దగా నచ్చకపోవడంతో నమ్రత పూరి జగన్నాథ్ ని రిజెక్ట్ చేసింది.
దానికి హర్ట్ అయిన పూరి మహేష్ బాబు తన మూస నమ్మకంతో తనకి అవకాశం ఇస్తాడు అని ఎదురుచూశాడు. కానీ మహేష్ బాబు కూడా దీని మీద స్పందించకపోవడంతో పూరి లైట్ తీసుకొని వేరే హీరోలతో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.
Also Read: స్పిరిట్ మూవీకి సందీప్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న మంచి కమ్యూనికేషన్ చెడిపోయిందనే చెప్పాలి…మరి ఫ్యూచర్ లో మళ్ళీ వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చేసే అవకాశాలేమైనా ఉన్నాయా అనే ధోరణిలో మహేష్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…