Lokesh Kanagaraj And Trivikram Srinivas: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకులలో ఒకరు లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj). ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో, కూలీ వంటి చిత్రాలతో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. కూలీ, లియో చిత్రాలు కమర్షియల్ గా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు పైగా రాబట్టినప్పటికీ, సినిమా కంటెంట్ పరంగా ఆ రెండు సినిమాలు తీవ్రమైన విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి ఎదురు చూసే సూపర్ స్టార్స్, కూలీ ఔట్పుట్ ని చూసి, ఆమ్మో ఇతనితో ఎందుకులే అని భయపడుతున్నారు. అందుకే ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో ఆయన ఏ హీరో తో పని చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.
లోకేష్ కనకరాజ్ డేట్స్ ని టాలీవుడ్ లో రెండు ప్రొడక్షన్ హౌస్లు సంపాదించాయి. ఆ రెండు ప్రొడక్షన్ హౌస్ల పేర్లు KVN ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్. KVN ప్రొడక్షన్స్ సంస్థ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గానే లోకేష్ కనకరాజ్ హైదరాబాద్ కి వచ్చాడు. అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ విజువల్స్ ని కూడా మనం గమనించొచ్చు. అయితే ఆయన హైదరాబాద్ కి వచ్చి అల్లు అర్జున్ ని కలిసి స్టోరీ ని వినిపించి వెళ్లాడని కొందరు సోషల్ మీడియా లో అంటున్నారు. మరికొందరు అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలిసిన లోకేష్ కనకరాజ్, పవన్ కళ్యాణ్ తో చేయబోయే మూవీ స్క్రిప్ట్ ని వినిపించి వెళ్లాడని అంటున్నారు.
ఈ రెండిట్లో ఏది నిజం?, లోకేష్ ఎవరిని కలిసి స్టోరీ ని వినిపించాడు అని సోషల్ మీడియా లో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం చూస్తే, లోకేష్ కనకరాజ్ ఇద్దరికీ స్టోరీలు వినిపించి వెళ్లాడని, అల్లు అర్జున్ వైపు నుండి ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి లోకేష్ వినిపించిన కథ ఓకే అయిపోయిందని అంటున్నారు. అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ మూవీ ఖరారు అయిపోయినట్టే అని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. న్యూ ఇయర్, లేదా సంక్రాంతి లోపు ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయట.