అది చంచల్ గూడ జైలు.. పక్కనే ముగ్గురు ఖైదీలున్నారట… ఎప్పుడూ వార్డెన్స్, ఖైదీలతో రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి చోట.. అదీ గొంతుకు సరిగా చుట్టుకోరాని సీల్ కు కూడా కట్టరాని టవల్ తో ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమా? కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య కేసులో ఇప్పుడు కుటుంబ సభ్యుల అనుమానాలు సంచలనంగా మారాయి. కీసర తహసీల్దార్ నాగరాజుది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేస్తామని తెలిపారు. ఈ మేరకు నాగరాజు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
Also Read: కులాలకు చెల్లు.. జగన్ మరో సంచలన నిర్ణయం
చనిపోవడానికి ముందు ఉదయం మాతో నాగరాజు ఫోన్లో మాట్లాడాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. త్వరలో వచ్చేస్తాను అన్నాడని.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవన్నీ కామన్ అని.. ఏసీబీ కేసుల్లో ఏం తేలదని.. ధైర్యంగా ఉండమన్నాడని చెప్పాడని వివరించారు.. అలాంటి నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్ గా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు నాగరాజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నాగారాజు ఎవరితో ఏం మాట్లాడారు? ఏం చెప్పారు.? కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఒక్క వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలు..
ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు చేసిన సంచలన ఆరోపణలతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాగరాజును ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని.. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నాగరాజు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని.. తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయని వారు సంచలన నిజాలను వెల్లడించారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచిచూడాలి. .