Srireddy : శ్రీరెడ్డి.. ప్రత్యేకంగా ఈమె గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈమె ఒక హాట్ బాంబ్.. సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ ఎంత వివాదస్పదుడో అంతకుమించిన కాంట్రవర్సీ ఉమెన్ శ్రీరెడ్డి. అప్పట్లో ఓ నిర్మాత కొడుకుపై లైంగిక ఆరోపణలు చేసి ఏకంగా ‘మా’ కార్యాలయం ముందు నగ్నంగా భైటాయించి సంచలనం రేపింది.

ఇక అనంతరం పవన్ కళ్యాణ్ పై బూతులతో విరుచుకుపడి శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది. అయితే తినడానికి తిండి లేని స్థితి నుంచి ఇప్పుడు సినిమాల్లో నటించే స్థాయి వరకూ వచ్చింది. తమిళంలో హాట్ హాట్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తెలుగులో అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి.
ఎప్పుడూ ఏదో విషయంపై శ్రీరెడ్డి కామెంట్ చేస్తుంటుంది. సినీ, రాజకీయ సమకాలీన అంశాలపై శ్రీరెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేస్తోంది. ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదంలో జగన్ కు , మోహన్ బాబుకు సపోర్టు చేసి చిరంజీవిని కించపరిచేలా మాట్లాడింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు వదులుతూ అభిమానులకు సెగలు పుట్టిస్తోంది.
ఇక అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని శ్రీరెడ్డి బాగానే ఆస్తులు కూడబెట్టిందట.. శ్రీరెడ్డికి ఖరీదైన అపార్ట్ మెంట్లు, కార్లు ఉన్నాయన్నది టాక్. ఈ విషయంలో తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది
.
తనకు హైదరాబాద్ లో మాత్రమే సొంతిళ్లు ఉందని.. అంతేకాకుండా ఒక ఆడి కారు ఉందని శ్రీరెడ్డి తెలిపింది. మీరనుకున్నట్లుగా ఆస్తులేవీ లేవని స్పష్టం చేసింది. వీటి విలువ కోటి రూపాయల వరకూ ఉంటుందని సమాచారం. ఇక తల్లిదండ్రులకు కోట్లలోనే ఆస్తి ఉందని.. కానీ వారు శ్రీరెడ్డిని దూరం పెట్టారని తెలిసింది.
ప్రస్తుతం చెన్నైలో అద్దెకు ఉంటున్న చాలా చిన్నది అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఇటీవల కాలంలో తాను డబ్బు సంపాదించింది కూడా ఏమీ లేదని తెలుపుతోంది. తల్లిదండ్రుల సపోర్టు లేకుండా బతుకుతున్న ప్రతీ అమ్మాయికి ఒక సొంతిళ్లు ఉండాలని శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. తన సొంతింట్లో తాను స్వేచ్ఛగా ఉంటానని వివరించింది.
తనకు టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడం లేదని.. కానీ తమిళలు మాత్రం తమకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారని శ్రీరెడ్డి తెలిపింది. ఎంత వివాదాస్పదంగా తాను మారినా చెన్నైలో మాత్రం అవకాశాలు దొరుకుతున్నాయని శ్రీరెడ్డి చెబుతోంది. ఇక రానున్న రోజుల్లోనూ తాను చెన్నైలోనే స్థిరపడాలని భావిస్తోందట..
[…] CM KCR: దేశంలో మూడో కూటమి ప్రయత్నాలకు కేసీఆర్ బీజం వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో జట్టు కట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు గాను వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ సీఎంలను కలిసిన కేసీఆర్ తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ను ప్రగతి భవన్ లో కలిసి చర్చలు జరిపారు. బీజేపీయేతర పార్టీల ఏకీకరణకు నడుం బిగించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే నేతల ఐక్యతకు పెద్దపీట వేస్తున్నారు. […]