https://oktelugu.com/

Keerthi Suresh : కీర్తి సురేష్ అంత సాహసానికి ఒడిగట్టిందా… తేడా వస్తే నిండా మునుగుతుంది!

Keerthi Suresh : మనకు తెలియని వ్యవహారంలో వేలు పెట్టడం అంత మంచిది కాదు. కొన్ని పనులు చాలా రిస్క్ తో కూడుకొని ఉంటాయి. ఏదైనా తేడా కొడితే మొత్తంగా ముంచేస్తాయి. వాటిలో సినిమా నిర్మాణం ఒకటి. ప్రతి ఏడాది చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. పట్టుమని పది సినిమాలు తీసే కెపాసిటీ ఎవరికీ ఉండటం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ దాదాపు గ్యాంబ్లింగ్ తో సమానం. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2022 / 10:24 AM IST
    Follow us on

    Keerthi Suresh : మనకు తెలియని వ్యవహారంలో వేలు పెట్టడం అంత మంచిది కాదు. కొన్ని పనులు చాలా రిస్క్ తో కూడుకొని ఉంటాయి. ఏదైనా తేడా కొడితే మొత్తంగా ముంచేస్తాయి. వాటిలో సినిమా నిర్మాణం ఒకటి. ప్రతి ఏడాది చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. పట్టుమని పది సినిమాలు తీసే కెపాసిటీ ఎవరికీ ఉండటం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ దాదాపు గ్యాంబ్లింగ్ తో సమానం. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పది సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఒక్క సినిమాలో పోతాయి. అందుకే దశాబ్దాల పాటు నిర్మాణంలో ఉన్న సంస్థలు మనకు నాలుగైదు కంటే ఎక్కువ కనిపించవు.

    ఇంత రిస్క్ తో కూడుకున్న చిత్ర నిర్మాణంలోకి హీరోయిన్ కీర్తి సురేష్ అడుగుపెడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఆమె నిర్మాత కావాలి అనుకుంటున్నారట. దీనిలో భాగంగా ఆమె ప్రణాళికలు వేస్తున్నారట. నిర్మాతగా ఒక కొత్త సినిమా ప్రకటించబోతున్నారనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. ఈ క్రమంలో శ్రేయోభిలాషులు ఆమెను హెచ్చరిస్తున్నారట. హాయిగా సినిమాలు చేసుకోక, ఈ టెన్షన్స్ నీకు అవసరమా? వద్దు, వదిలేయమని సలహా ఇస్తున్నారట.

    అందులోనూ చిత్ర నిర్మాణం హీరోయిన్స్ కి కలిసొచ్చిన దాఖలాలు లేవు. దానికి మహానటి సావిత్రి గొప్ప ఉదాహరణ. నిర్మాణంలో అనుభవం లేని సావిత్రి కొందరిని గుడ్డిగా నమ్మి సర్వం కోల్పోయింది. సహజనటి జయసుధ కూడా బాధితురాలే. నిర్మాతగా ఆమె చివరి చిత్రం హాండ్సప్. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో జయసుధ ఆర్థికంగా నష్టపోయారు. నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుండి కోలుకునేందుకు జయసుధకు చాలా ఏళ్ళు పట్టింది.

    ఈ జనరేషన్ లేడీ ప్రొడ్యూసర్ ఛార్మి పరిస్థితి కూడా దాదాపు అదే. ఆమె నటనకు గుడ్ బై చెప్పేసి దర్శకుడు పూరి పార్టనర్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్లో అరడజను చిత్రాల వరకు తెరకెక్కాయి. హిట్ అయ్యింది ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. లేటెస్ట్ రిలీజ్ లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఇక జనగణమన మధ్యలో ఆగిపోయింది. ఇన్ని ఉదాహరణలు కనిపిస్తుంటే కీర్తి నిర్మాణం వైపు వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు. కాగా కీర్తి తల్లి మేనక ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాగా, తండ్రి సురేష్ దర్శకుడు.