https://oktelugu.com/

Heroine shock: హాట్ టాపిక్.. అదనంగా డిమాండ్ చేసిన హీరోయిన్.. సినిమా నుంచి తొలగించిన నిర్మాత

Heroine shock: ఆ హీరోయిన్ క్రమతప్పకుండా వార్తల్లో ఉంటోంది. ఆమె తెరపై సాహసోపేతమైన పాత్రలను పోషిస్తోంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా బోల్డ్ యాటిట్యూట్ తో పేరుగాంచింది. అంతకుముందు తన ఈ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచింది. ఇది ఆమె కెరీర్ పై కూడా ప్రభావం చూపింది. ఆమె వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయ్యాక ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యింది. సౌత్ నుంచి వచ్చిన ఈ హీరోయిన్ తాజాగా ఒక సీరియర్ స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2021 / 09:21 PM IST
    Follow us on

    Heroine shock: ఆ హీరోయిన్ క్రమతప్పకుండా వార్తల్లో ఉంటోంది. ఆమె తెరపై సాహసోపేతమైన పాత్రలను పోషిస్తోంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా బోల్డ్ యాటిట్యూట్ తో పేరుగాంచింది. అంతకుముందు తన ఈ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచింది. ఇది ఆమె కెరీర్ పై కూడా ప్రభావం చూపింది. ఆమె వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయ్యాక ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యింది.

    hero producer

    సౌత్ నుంచి వచ్చిన ఈ హీరోయిన్ తాజాగా ఒక సీరియర్ స్టార్ హీరో సరసన తెలుగులో చిత్రానికి సైన్ చేసింది. సీనియర్ స్టార్ ఈ నటిని తీసుకోవాలని పట్టుబట్టడంతో మేకర్స్ అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారట..

    ఈ క్రమంలోనే నిర్మాత ఆ హీరోయిన్ ను కలవగా ఆమె డిమాండ్ విని వారికి షాక్ తగిలింది. ఈ మధ్య ఆమెకు పెద్దగా క్రేజ్ లేదు.అయినప్పటికీ ఆమె చాలా డిమాండ్ల జాబితాను వారి ముందు ఉంచేసరికి అవాక్కయ్యారట..పారితోషికం కంటే ఆమె వైఖరి చూసి ఆ నిర్మాత ముందుకెళ్లకుండా చేసిందట..

    నిర్మాత ఆమె డిమాండ్లన్నింటిని అంగీకరించి ఆమె అడిగిన అన్ని విలాసాలను అందించినట్లతే వారు మరో రూ.50 లక్షలు ముట్టజెప్పాల్సి ఉంటుంది. దీంతో ఆమెను సినిమానుంచే తీసేశారట.. తీసుకోవద్దని డిసైడ్ అయ్యారట..

    ఇప్పుడు ఆమె స్థానంలో మరో నటి కోసం మేకర్స్ వెతుకుతున్నారు. ఇక తమకు వేరే మార్గం లేదని సీనియర్ హీరోకు కూడా తెలియజేశారు. సీనియర్ అయిష్టంగానే వారి ప్రతిపాదనకు అంగీకరించాడట.. కాబట్టి చాలా కాలంగా మేకింగ్ లో ఉన్న ఈ సీనియర్ నటుడి ప్రాజెక్ట్ కోసం ఒక లోకల్ హీరోయిన్ ను తీసుకోబోతున్నట్టు సమాచారం. నటి ఇటీవల రెండు తెలుగు వెబ్ డ్రామాలలో కనిపించింది.