RRR: పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ మల్టీస్టారర్ గా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న మాట.. ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ మధ్య వచ్చే ఫైట్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా బీమ్ – రామరాజు ఒకరి పై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోందని, ఆ దాడికి సంబంధించి వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తెలుగు వెండితెర పైనే గొప్ప విజువల్ ఫైట్ గా ఉంటుందని గతంలో విజయేంద్రప్రసాద్ చెప్పారు.
అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఇప్పుడు ఆ ఫైట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క సినిమా ప్రమోషన్లలో ఉన్న రాజమౌళి చెన్నై ఈవెంట్ లో కూడా మాట్లాడుతూ.. ‘ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతుందని, ఆ సీన్ అభిమానుల ఊహకు కూడా అందదు అని, అంత అద్భుతంగా ఆ ఫైట్ ఉంటుందని చెప్పుకొచ్చారు .
Also Read: ‘మహేష్ సినిమా’ పై ఓపెన్ అయిన రాజమౌళి !
అయితే, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైటే ఎన్టీఆర్ -చరణ్ మధ్య వస్తోందని తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 13 నిమిషాల పాటు ఈ ఫైట్ ఉంటుందట. బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ – బ్రిటిష్ అధికారుల పై పోరాడే విప్లవ నాయకుడిగా ఎన్టీఆర్ ఈ ఫైట్ లో పోటీ పడి మరి నటించారట. మరి ఒకరికి మించి మరొకరు నువ్వా నేనా అన్న రేంజ్ లో నటించిన ఈ ఫైట్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాగే ఎన్టీఆర్ పై వచ్చే ఫులి ఫైట్ కూడా చాలా బాగుంటుందట. అయితే, ప్రస్తుతం కరోనా మూడో వేవ్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్‌ఫ్యూ విధిస్తున్నారు. అలాగే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెడుతున్నారు. రానున్న వారం రోజుల్లో కూడా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక జనం థియేటర్స్ కి రారు. అప్పుడు ఆర్ఆర్ఆర్ కి భారీ నష్టమే. ప్రస్తుతం ఆ భయమే ఎక్కువగా ఉంది ఆర్ఆర్ఆర్ టీమ్ లో. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: ముందు నుయ్యి వెనుక గొయ్యి… ఇదీ ఆర్ఆర్ఆర్ పరిస్థితి !