AP Govt Order: అగ్గిపుల్ల.. సబ్బు బిల్లా.. కాదేది క్యాష్ చేసుకోవడానికి అనర్హం ఉన్నట్టుంది ఏపీ సర్కార్ తీరు అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తాజాగా ప్రచారమవుతున్న ఒక ఆర్డర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వంపై విమర్శల వాన కురుస్తోంది.
గుంటూరు నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ నిరంజన్ పేరిట సర్క్యూలేట్ అవుతున్న ఒక ఆదేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వచ్చాక ‘వలంటీర్ల’ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎంతో పేరు తీసుకొచ్చింది. జగన్ సర్కార్ పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకొచ్చిందని సంబరపడింది.
Also Read: వివేకా హత్య కేసులో ఇక వేగం పెరగనుందా?
అయితే వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినమాట వాస్తవమే. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సరైన విధంగా పథకాలు వచ్చాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ వలంటీర్లే జీతాల సమస్య, సౌకర్యాలు లేవంటూ అప్పుడప్పుడూ ఆందోళన చేస్తున్నారు.
ఇవన్నీ చాలదన్నట్టు జగన్ సర్కార్ తాజాగా మరొక పనిని వలంటీర్లకు అప్పగించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఆదేశాలు వైరల్ అవుతున్నాయి. మరుగుదొడ్లు వద్ద వాలంటీర్లకు డ్యూటీలు వేశారని.. డబ్బులు వసూలు చేయవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారన్నది ఆ లేఖలో ఉన్న సారాంశం. ఆఖరుకు సీఎం జగన్ ఆదాయం కోసం వలంటీర్లను మరుగుదొడ్ల వద్ద కాపాలా పెట్టించాడా? అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also Read: పార్టీ గెలిస్తే తొలి సంతకం దాని మీదే అంటున్న రేవంత్.. కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంటుందా..?
నిరుద్యోగ యువత కి పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తున్నాడని జగన్ అని ఈ ప్రభుత్వ ఆదేశాల కాపీని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తనదైన శైలిలో ఒక్కొక్కడి సరదా తిర్చేస్తున్నదుకు ధన్యవాదాలు సీఎం సార్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇది నిజమా? అబద్ధమా? అన్నది తేలాల్సి ఉంది.
-సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభుత్వ ఆదేశాల ప్రతి