Dhurandhar 2: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగిపోయింది. మన వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తుండడం వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ గా ముందుకు సాగుతుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ పో రీసెంట్ గా వచ్చిన ‘దురంధర్ 2’ సినిమా సైతం ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి దక్కిన ఆదరణ అంతా ఇంకా కాదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు రాబోయే ఏ సినిమా అయినా కూడా దురంధర్ 2 సినిమా కంటే ఎక్కువ విజయాన్ని సాధించాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే దురంధర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది అంటూ దేశం అంతటా ప్రతి ఒక్కరు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్వరు ఆ సినిమా గురించి మాట్లాడటం లేదు. కారణం ఏంటి అంటే ఆ సినిమా గురించి మాట్లాడితే వాళ్లు ఇతరుల విషయంలో ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అనే ఉద్దేశ్యంతో ఉన్నారా? ముఖ్యంగా ఖాన్ త్రయం మాట్లాడటం లేదు.
వాళ్ళ కంటే యంగ్ హీరో అయిన రణ్వీర్ సింగ్ ముందుకు వెళుతున్నాడనే అసూయ తో ఉన్నారా? లేదంటే భారతదేశానికి సంబంధించిన ఒక రా ఏజెంట్ పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ ఉన్న టెర్రరిస్టులను చంపేయడం వాళ్లకు నచ్చదలేదా…అసలు ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్లు ఇంకా స్పందించకపోవడం పట్ల చాలామంది చాలా రకాల విమర్శలైతే చేస్తున్నారు.
ఇప్పటికే మన స్టార్ హీరోలు దర్శకులు సైతం ఈ సినిమా అద్భుతంగా ఉందంటు ట్వీట్లు చేశారు. దాని వల్ల కూడా ఆ సినిమాకి ప్రీ పబ్లిసిటీ రావడం చాలామంది సినిమా చూడడానికి ప్రేరేపించిందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందనే చెప్పాలి…