Rajamouli : తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుకున్న మొదటి టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. ఆయన చేసిన బాహుబలి సినిమాతో ఇండియాలోనే ది బెస్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక బాహుబలి 2 సినిమాతో 2000 కోట్ల కలక్షన్స్ ని రాబట్టి ఇప్పటివరకు కూడా ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసే సినిమా రాలేదు అంటే ఆ సినిమాకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో తెలుగు డైరెక్టర్ లందరూ కూడా పాన్ ఇండియా సినిమా చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి రెమ్యూన్ రేషన్ మీద చాలా వార్తలైతే వస్తున్నాయి. ఒక్క సినిమా కోసం తను 150 నుంచి 200 కోట్ల వరకు డబ్బులను రెమ్యూన్ రేషన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికి రాజమౌళి అన్ని వందల కోట్లు రెమ్యూన్ రేషన్ గా తీసుకోవడంలో తప్పులేదు.
ఎందుకంటే ఆయన సినిమా కోసం పడే కష్టం ముందు ఇవన్నీ చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన దగ్గరుండి మరి చూసుకొని సెట్ చేసి మరి సినిమాని తెరకెక్కిస్తాడు. ఇక ఆయన లాంటి దర్శకుడికి రిమ్యున్ రేషన్ గా 200 కోట్లు ఇచ్చిన తప్పు లేదంటూ అభిప్రాయపడే వారు కూడా ఉన్నారు. ఇక ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి తీసుకున్న రెమ్యూన్ రేషన్ ని ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వాళ్ల సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూన్ రేషన్ ని ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి తొందర్లోనే తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతాన్ని తెరకెక్కించే టైంలో ఆ ల్యాండ్స్ రేట్ విపరీతం పెరుగుతుంది కాబట్టి వాటిని తీసేసి వాటి మీద వచ్చిన డబ్బుతో ఆ సినిమాకి తనే ప్రొడ్యూసర్ గా మారి స్వీయ దర్శకత్వంలో సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. దాదాపుగా మహాభారతాన్ని తెరకెక్కించడానికి 3 వేల నుంచి 4 వేల కోట్ల వరకు డబ్బులు అవసరమవుతుంది కాబట్టి ఇంకొక మూడు నాలుగు సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి ఆ ప్రాజెక్టు ని పట్టలెక్కించే పనిలో ఉన్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ఇండియాలో ఉన్న స్టార్ నటులతో పాటు హాలీవుడ్ నటులను కూడా భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మూడు నుంచి నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమా దాదాపు పదివేల కోట్లకు పైన కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాతో రాజమౌళి కి పేరు తో పాటు డబ్బులు కూడా విపరీతం గా వస్తాయనే ఉద్దేశ్యం తో ఇలా ప్లాన్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే రాజమౌళి వేసిన ప్లాన్ అద్భుతంగా ఉంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు…