Actress Srivani : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అందరూ కూడా యూట్యూబ్ ద్వారా ఎక్కువ సంపాదించేస్తున్నారు. సీరియల్ దగ్గర నుంచి మొదలు పెడితే సినిమాల్లో నటించే వారందరు కూడా యూట్యూబ్ సంపాదనను వదలడం లేదు. ఇతర ఆదాయం కోసం ఇలా యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించి వారికి సంబంధించిన అన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత ఊరటనిస్తుంటారు. ఇదే క్రమంలో బుల్లితెర నటీనటుల్లో శ్రీవాణికి కూడా మంచి గుర్తింపు ఉంది. మరి ఆమె ఎంత సంపాదిస్తుందో తెలుసా?
బుల్లితెర నటి శ్రీవాణి విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీవాణి విక్రమాదిత్య ఇద్దరు కూడా బుల్లితెర నటీనటులుగా కొనసాగారు. అయితే ప్రస్తుతం శ్రీ వాణి సీరియల్స్ లో నటిస్తుంటే.. విక్రమ్ మీ కడుపు నిండా అనే హోటల్ ను రన్ చేస్తున్నారట. ఇక ఈ దంపతులుకు రాజ నందిని అనే ఒక కుమార్తు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్న శ్రీవాణి యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్నారు. ఈమె తనకు సంబంధించిన విషయాలతో పాటు రెస్టారెంట్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆమె తనకు సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించారు. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.
మేము మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని.. మాకు ఉన్నదాంట్లో మేము సంతోషంగా ఉన్నామని.. ఎలాంటి ఆడంబరాలకు పోమని తెలియజేశారు శ్రీవాణి. ఇక యూట్యూబ్ ద్వారా మీ అభిమానులకు దగ్గరగా ఉన్నారు. అందరిని అలరిస్తుంటారు. ఇంతకీ యూట్యూబ్ ద్వారా మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే ప్రశ్నకు…ఈ దంపతులు షాకింగ్ సమాధానం చెప్పారు. అయితే యూట్యూబ్ లో మేము పోస్ట్ చేసిన కొన్ని వీడియోలకు రూ. 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ వచ్చిందని తెలిపింది.
తాజాగా ఆదిరెడ్డి తనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక నెలకు రూ. 39 లక్షల రెమ్యూనరేషన్ వచ్చిందంటూ ఆధారాలతో సహా చూపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీవాణి దంపతులకు కూడా తన కుమార్తె సారీ ఫంక్షన్ వీడియోను షేర్ చేయడంతో ఆ నెల వారికి రూ. 30 లక్షల వరకు అమౌంట్ వచ్చిందని తెలిపింది. ఆ డబ్బుతో ఓ కొత్తింటికి అడ్వాన్స్ ఇచ్చారట. అంతే కాదు గృహ ప్రవేశం వంటి మరికొన్ని వీడియోలకు కూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయని వాటికి కూడా లక్షల్లో డబ్బులు వచ్చాయని తెలిపింది. దీంతో వామ్మో శ్రీవాణి దంపతులు ఇంత సంపాదిస్తున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.