
ఒకచిన్న పొరపాటు.. పెద్ద పరిహారం అన్నట్లు అయింది ఇప్పుడు ఓ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ పరిస్థితి. ఇటీవల ఏపీ సీఎం జగన్‌ను కించపరుస్తూ ఒక కామెడీ షోలో ఓ స్కిట్ టెలికాస్ట్ అయింది. నాగబాబు ఆధ్వర్యంలో నడిచే ఈ షోలో టెలికాస్ట్ చేసిన ఈ స్కిట్‌పై పెద్ద దుమారమే రేగింది. అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వైరల్ అయింది.
Also Read: వంగవీటి రాధాను అందుకే లైట్ తీసుకుంటున్నారా..?
సదరు నటుడు రియలైజ్ అయి వెంటనే క్షమాపణ చెప్పాడు. దీంతో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాస్త చల్లబడ్డారు. కానీ..ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు ట్వీట్ మాత్రం పుండు మీద కారం చల్లినట్లుగా చేసింది. దీంతో మళ్లీ జగన్ అభిమానుల్లో ఒక్కసారిగా కోపం పెరిగిపోయింది. ఆటోమేటిక్‌గా ఛానెల్ కూడా ఇబ్బందుల్లో పడింది. ‘బ్యాన్ ఆ చానెల్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
దీంతో సదురు టీవీ యాజమాన్యం దిగిరావాల్సి వచ్చింది. నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. ఏపీ ప్రభుత్వానికి ఏకంగా 10 అంబులెన్స్‌లు, నాలుగు వేల పీపీఈ కిట్లు అందించింది. అంతేకాదు.. దీనికి భారీ స్థాయిలో ప్రచారం కూడా చేసుకుంది. ఈ రాజీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా మధ్యవర్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమె చేతుల మీదుగానే అంబులెన్స్ ల ప్రారంభోత్సవం జరిగిందట. అంతేకాదు.. రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని కూడా ఈ కార్యక్రమానికి పిలిచి మరింత కవరేజీ సాధించింది సదరు ఛానెల్.
Also Read: జగన్ తీవ్ర ఆరోపణ: చంద్రబాబు మౌనం వెనుక కారణమేంటి..?
నిజానికి ఈ కార్యక్రమం ఇలా రాజీ కోసం పెట్టింది కాదు. ఓవైపు వివాదం చెలరేగడం, అదే టైమ్ లో అంబులెన్సులు అందించే కార్యక్రమం ఫిక్స్ అవ్వడం అనుకోకుండా జరిగాయి. సదురు టీవీ చానెల్ కు అలా కలిసొచ్చిందంతే. అయితే అంబులెన్స్‌లు, పీపీఈ కిట్లు ఇచ్చినంత మాత్రాన సదురు చానెల్ చేసిన చేసిన తప్పును మరిచిపోతారా. మరీ ముఖ్యంగా చానెల్ ను అడ్డుపెట్టుకొని నాగబాబు లాంటి వ్యక్తులు ప్రభుత్వంపై, సీఎం జగన్ పై బురదజల్లారు. దీంతో ఈ ప్రాయచిత్తంతోనైనా చానెల్ కు , వైసీపీకి వివాదం సమసిపోతుందా లేదా అన్నది చూడాలి.?