Varanasi Movie Updates: కొన్ని కథలను దర్శకులు ఒక హీరో తో చెయ్యాలని ముందుగానే ఫిక్స్ అయ్యి రాస్తుంటారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ కథలు వేరే హీరో చేతుల్లోకి వెళ్తుంటాయి. ఇలా ఈమధ్య కాలం లో చాలానే జరిగాయి. కొంతమందికి అదృష్టం కలిసొచ్చి స్టార్స్, సూపర్ స్టార్స్ గా కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అలాంటి కథలను అందుకొని డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉండగా మహేష్(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న ‘వారణాసి’ మూవీ కథ కూడా అలాంటిదే అట. ఈ చిత్రాన్ని ముందుగా రాజమౌళి ప్రభాస్(Rebel Star Prabhas) ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో పదేళ్ల క్రితం రాసుకున్న స్టోరీ అట. మహేష్ బాబు తో సినిమా ఫిక్స్ అయ్యి 15 ఏళ్ళు దాటింది. దీంతో #RRR తర్వాత కచ్చితంగా మహేష్ తో సినిమా చెయ్యాలి కాబట్టి, ఈ వారణాసి కథ ని మహేష్ కి వినిపించే ప్రయత్నం చేసాడట.
బాహుబలి సిరీస్ పూర్తి అవ్వగానే ప్రభాస్ కి ఈ కథని వినిపించి #RRR తర్వాత వెంటనే సెట్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉండేవాడట రాజమౌళి. అనుకున్నట్టుగానే ప్రభాస్ కి కథ ని కూడా వినిపించాడట. ఆయనకు నచ్చింది కానీ, రాబోయే 8 ఏళ్ళ వరకు వరుసగా సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాను, ఇప్పుడే మన కాంబినేషన్ లో సినిమా వద్దు, వేరే హీరో తో ఈ చిత్రాన్ని చేస్తే బాగుంటుందని సూచించాడట. దీంతో రాజమౌళి ఈ కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి, మహేష్ బాబు కి వినిపించాడట. మహేష్ బాబు కి ఈ కథ విపరీతంగా నచ్చడం తో వెంటనే స్క్రిప్ట్ డైలాగ్స్ వెర్షన్స్ మొదలు పెట్టమని చెప్పాడట. ఇదంతా #RRR మూవీ మొదలు అవ్వకముందే జరిగింది. అలా మొదలైన ఈ ప్రాజెక్ట్ నేడు ఇలా మన ముందుకు రాబోతోంది.
కథ విషయానికి వస్తే త్రేతాయుగం శ్రీ రాముడి వంశానికి చెందిన 46 వ తరం వారసుడు చుట్టును ఈ కథ నడుస్తోంది. ఒక కొత్త కలల ప్రపంచాన్ని నిర్మించడానికి విలన్ సిద్ధం అవుతాడు. కానీ అతనికి అంత శక్తి లేదు. అవిటివాడు అవ్వడం వల్ల అతను ఏ పని చేయలేకపోతుంటాడు. అలాంటి సమయం మృత సంజీవని వాడితే చాలా పవర్ ఫుల్ గా మారిపోవచ్చనే విషయం విలన్ కి తెలుస్తుంది. ఆ సంజీవని ఆఫ్రికా లోని ఒక దట్టమైన అడవిలో ఉంటుంది. అక్కడికి వెళ్లడం ఎవరికీ సాధ్యం అవ్వదు. శ్రీరాముడు వంశానికి చెందిన హీరో కి తప్ప. దీంతో హీరో ని బలవంతంగా తీసుకొని రావడం, సంజీవని కోసం వెతకడం, ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సంఘటనలే ఈ సినిమా అట. ఊహించుకోండి రాజమౌళి ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తియ్యగలడు అనేది.