https://oktelugu.com/

Samantha Assets : విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తుల వివరాలు… ఆమె దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే!

Samantha Assets : సిల్వర్ స్క్రీన్ పై సమంత 12 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. మొదటి చిత్రం ఏమాయె చేశావే నుండి యశోద వరకు ఆమె కెరీర్ నెమ్మదించిన దాఖలాలు లేవు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సమంత సోలోగా ఎదిగింది. టాలెంట్ కి లక్ తోడు కావడంతో సమంతను ఆపడం ఎవరి తరం కాలేదు. సమంత సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దాంతో ఆమె లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ నేమ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2022 / 08:21 PM IST
    Follow us on

    Samantha Assets : సిల్వర్ స్క్రీన్ పై సమంత 12 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. మొదటి చిత్రం ఏమాయె చేశావే నుండి యశోద వరకు ఆమె కెరీర్ నెమ్మదించిన దాఖలాలు లేవు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సమంత సోలోగా ఎదిగింది. టాలెంట్ కి లక్ తోడు కావడంతో సమంతను ఆపడం ఎవరి తరం కాలేదు. సమంత సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దాంతో ఆమె లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ నేమ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ తో సమంత నటించారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ నమోదు చేశారు.

    సమంత లేటెస్ట్ మూవీ యశోద సూపర్ హిట్ కొట్టింది. నిర్మాతలకు మంచి లాభాలు పంచింది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరైన సమంత ఆస్తుల విలువ ఎంత? ఇన్నేళ్ల కెరీర్లో ఆమె ఎంత కూడబెట్టారనే? ఆతృత చాలా మందిలో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సమంత ఆస్తుల చిట్టా ఇలా ఉంది. సమంతకు హైదరాబాద్ లో లగ్జరీ అపార్ట్మెంట్స్ సముదాయంలో ఖరీదైన పెంట్ హౌస్ ఉంది. దీని ధర రూ. 2 కోట్లు పైమాటే. స్నేహితులతో కలిసి సమంత కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు.

    సాకీ అనే ఫ్యాషన్ బ్రాండ్ ఆమె రన్ చేస్తున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ ప్రొమోషన్స్ ద్వారా ఒక పెయిడ్ పోస్ట్ కి సమంత రూ. 10-20 లక్షలు వసూలు చేస్తారట. సినిమాకు సమంత రూ. 4-5 కోట్లు తీసుకుంటున్నారు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ తో పాటు రెండు మూడు లగ్జరీ కార్లు ఆమెకు ఉన్నాయి. ఇతర ఎండార్స్మెంట్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఆదాయం సంపాదిస్తున్నారు. ముంబై, చెన్నైలలో సమంతకు ఖరీదైన ఇళ్ళు ఉన్నట్లు సమాచారం.

    షేర్స్ రూపంలో ఆమె కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేశారట. మొత్తంగా సమంత ఆస్తుల విలువ రూ. 97 కోట్లు అట. నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు కూడా సమంత తన సంపాదన షేర్ చేయలేదట. చైతూ ఆల్రెడీ పెద్ద కుటుంబానికి చెందినవాడు, తనకంటూ హీరోగా కోట్లలో సంపాదన ఉంది. దీంతో సమంత సంపాదనను ఆయన టచ్ చేయలేదట. ఇక విడాకుల తర్వాత సమంత భరణం తీసుకున్నారన్నది నిజం కాదు. ఆత్మవిశ్వాసం కలిగిన సమంత నాగ చైతన్యపై కోపంతో ఒక్క రూపాయి కూడా ఆశించలేదట. చైతూ-సమంత ఇష్టపడి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టే లోపే విడిపోయారు. బహుశా ఆ ఇంటి నిర్మాణంలో సమంత కొంత ఖర్చు చేసి ఉండవచ్చు.