spot_img
Homeఎంటర్టైన్మెంట్CSK vs PBKS: జట్ల అంచనా.. హెడ్ టు హెడ్.. పిచ్ రిపోర్ట్.. ఫుల్ డీటెయిల్స్...

CSK vs PBKS: జట్ల అంచనా.. హెడ్ టు హెడ్.. పిచ్ రిపోర్ట్.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

CSK vs PBKS: ఐపీఎల్ లో భాగంగా మరో ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఒక విజయం సాధించి ఊపు మీద ఉన్న పంజాబ్.. రాజస్థాన్ వంటి జట్టు చేతిలో ఓటమి ఎదుర్కొని తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న చెన్నై తలపడుతున్నాయి. చెన్నై జట్టుకు సొంతమైన చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ఇటీవల గౌహతిలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ప్లేయర్ల పరంగా రాజస్థాన్ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ చెన్నై ఓడిపోవడం అభిమానులకు కలవరాన్ని కలిగిస్తోంది.. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చెన్నై ఆటగాళ్లు భావిస్తున్నారు. చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. పేస్ బౌలర్లకు ప్రారంభ ఓవర్లలో సహకారం అందిస్తుంది. అయితే ఈసారి ఈ పిచ్ మొత్తాన్ని మార్చినట్టు తెలుస్తోంది. బ్యాటర్లకు స్వర్గధామం లాగా రూపొందించినట్టు సమాచారం.. ధోని దూరంగా ఉన్నప్పటికీ.. అతడు ఇప్పటికే చెన్నై జట్టుతో చేరిపోయాడు. ఆటగాళ్లకు విలువైన సూచనలు ఇస్తున్నాడు.

బ్రేవిస్ ఆడేది అనుమానంగానే ఉంది. సంజు మీద చెన్నై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గైక్వాడ్ ఓపెనర్ గా వస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అతడు ఏ స్థాయిలో ఆడేది ఆసక్తికరం.. సర్ఫరాజ్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కార్తీక్ శర్మ లాంటి వాళ్లు తమ ఆట తీరును నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మాట్ హెన్రీ, నూర్ అహ్మద్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న నేపథ్యంలో.. సొంత మైదానంలో ఏ మేరకు ఆకట్టుకుంటారనేది ఆసక్తి కరం.

ఇక అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. కూపర్ కన్నోలీ, చాహల్, విజయ్ కుమార్ వైషాక్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే మిడిల్ ఆర్డర్ స్థిరమైన ఆట తీరు కొనసాగించలేకపోవడం పంజాబ్ జట్టును ఇబ్బంది పెడుతోంది.

ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచులు ఆడాయి. ఇందులో చెన్నై జట్టు 16 విజయాలు సాధించింది. పంజాబ్ కూడా అంతే సంఖ్యలో గెలుపులను నమోదు చేసింది. ఇక ఇటీవల మ్యాచులలో చెన్నై మైదానం నుంచి బౌలర్లకు పెద్దగా సపోర్ట్ లభించలేదు. బంతులు పెద్దగా బౌన్స్ కాలేదు. బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో పరుగులు చేయడానికి ఈ మైదానం సహకరించింది. మైదానం మీద తేలికపాటి గడ్డి ఉండడంతో … బ్యాటర్లకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ మైదానంపై ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జింబాబ్వే పై ఫోర్ వికెట్ల రాష్ట్రానికి 256 పరుగులు చేసింది.

చెన్నైలో వాతావరణం పొడిగా ఉంది. ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. రాత్రిపూట ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయ్యే అవకాశం ఉంది. వర్షం కురవడానికి అవకాశం లేదు. వాతావరణంలో కాస్త వేడి.. కాస్త తేమ ఉంది. సాయంత్రం వరకు మేఘాలు పూర్తిగా ఆవరించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular