
ప్రభాస్ పెద్దనాన్నా రెబల్ స్టార్ కృష్ణరాజుకు భారతీయ జనతా పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. వాజ్‌పేయి ప్రభుత్వంలో కృష్ణంరాజు ఏకంగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కృష్ణం రాజును తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందనే చర్చ కూడా సాగుతోంది.
ప్రధాని మోడీకి కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి సినిమా చూసి మోడీ అభినందించడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా కట్టప్ప-బాహుబలి సినిమాను వల్లెవేశాడు.
తాజాగా ప్రభాస్ హీరో ఇతిహాసం రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. అందులో రాముడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది. అప్పటికి అయోధ్య ఆలయం కూడా నిర్మిస్తారు.
కాబట్టి బిజెపి పార్టీ నేతలు పరోక్షంగా ఈ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని దూకుడుగా ప్రోత్సహిస్తున్నారట.. ఎందుకంటే ఇది వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలలో వారికి ‘ఆదిపురుష్’ సినిమా సహాయపడుతుందని వారంతా భావిస్తున్నారట..
అయితే ప్రభాస్ మాత్రం ఏ రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వరు. ఇప్పటికీ కూడా ఆయన ఏ పార్టీతో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడడు. తనకు రాజకీయాలంటే సూట్ కాదని.. సినిమాలే నా ప్రపంచం అని చెబుతుంటాడు.
Comments are closed.