https://oktelugu.com/

బిగ్ బాస్-4: ఈవారం హౌస్ నుంచి వెళ్లేది మాస్టారేనా?

బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో 50రోజులకుపైగా కొనసాగుతోంది. పలువురు కంటెస్టెంట్లు ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోగా గేమ్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టులంతా హౌస్ లో ఎక్కువ కాలం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో 8వ వారం ఎలిమినేషన్ పై జోరుగా చర్చ జరుగుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ 8వ వారం నామినేట్ అయిన వారిలో హీరోయిన్ మొనాల్.. యాంకర్ లాస్య.. అరియానా.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 10:55 AM IST
    Follow us on

    బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో 50రోజులకుపైగా కొనసాగుతోంది. పలువురు కంటెస్టెంట్లు ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోగా గేమ్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టులంతా హౌస్ లో ఎక్కువ కాలం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో 8వ వారం ఎలిమినేషన్ పై జోరుగా చర్చ జరుగుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    8వ వారం నామినేట్ అయిన వారిలో హీరోయిన్ మొనాల్.. యాంకర్ లాస్య.. అరియానా.. అఖిల్.. మెహబూబ్.. అమ్మా రాజశేఖర్ వంటివారు ఉన్నారు. వీరిలో యాంకర్ లాస్య.. అఖిల్.. అరియానాలకు ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా లభిస్తోంది. హీరోయిన్ మొనాల్.. మోహబూబ్.. అమ్మా రాజశేఖర్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: సోనూసుద్‌ : వారిని ఆదుకున్నాడు.. వీరికి షాక్‌ ఇచ్చాడు..!

    ఈ ముగ్గురిలోనూ అందరిచూపు డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ పైనే ఉంది. కిందటివారం దివీ ఎలిమినేట్ అవడానికి కారణం డాన్స్ మాస్టర్ అనే టాక్ విన్పించింది. దీంతో అతడికి ఈవారం చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొనాల్.. మెహబూబ్ కంటే అమ్మా రాజశేఖర్ కు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడనే చర్చ నడుస్తోంది.

    ప్రతీసారి ఎలిమినేషన్ నుంచి ఏదోఒక విధంగా ఎస్కేప్ అవుతున్న రాజశేఖర్ ఈసారి బయటికి వెళ్లడం ఖాయమని మెజార్టీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ ఇతర కంటెస్టెంట్లను బలి చేస్తూ హౌస్ లో కొనసాగుతున్నాడనే కామెంట్స్ విన్పిస్తోంది. దీంతోనే అతడికి ఈసారి వ్యతిరేకంగా ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్-4లో ఎలిమినేషన్స్ పై ప్రేక్షకులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: ఆరోగ్య సమస్యలు ఉన్న మాట నిజమేనంటున్న రజినీ

    బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు సైతం తమకు అన్యాయం జరిగిందని మీడియా ముందు వాపోతున్నారు. ఇప్పటికే నోయల్ సీన్ హౌస్ నుంచి వెళ్లిపోవడంతో 8వ వారం ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? అనే చర్చ కూడా నడుస్తోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారనుంది.