BB Jodi 2: ‘బిగ్ బాస్ 9’ లాంటి బ్లాక్ బస్టర్ సీజన్ తర్వాత స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయిన షో ‘BB జోడి 2’. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని బిగ్ బాస్ సీజన్ లోని కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఈ షో ని నిర్వహిస్తున్నారు. గతం లో కూడా ఇలాంటి షో చేశారు , గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుత సీజన్ కూడా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ‘బిగ్ బాస్ 9’ నుండి ఏ కంటెస్టెంట్స్ కూడా రాలేదేంటి అని అనుకుంటున్న సమయం లో నిన్నటి ఎపిసోడ్ లోకి రీతూ చౌదరి, డిమోన్ పవన్ జంట ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళ మొదటి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కి కంటెస్టెంట్స్ మరియు జడ్జీల నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అవ్వబోయే మొట్టమొదటి జంట గురించి ఒక లీక్ వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గత వారం డేంజర్ జోన్ లోకి వచ్చిన అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య జంట, అదే విధంగా నేహా, విశ్వ జంటలకు అదృష్టం కలిసొచ్చి, జడ్జీలు ఎలిమినేషన్ ని రద్దు చేశారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున ఏ కంటెస్టెంట్ కూడా బాధ పడకూడదు అనే ఉద్దేశ్యంతో అన్నమాట. కానీ ఈసారి మాత్రం ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఈ వారం, వచ్చే వారం డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కి జడ్జీలు, కంటెస్టెంట్స్ ఇచ్చిన మార్కుల ఆధారంగా, రెండు టీమ్స్ నుండి ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చి ఉంటాయో, ఆ ఇద్దరు ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ లో పోటీ పడుతారు. ఈ పోటీలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, వాళ్ళు సేఫ్ అవుతారు, తక్కువ మార్కులు వచ్చిన జంట ఎలిమినేట్ అవుతారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ప్రకారం అయితే వచ్చే వారం ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ లో మణికంఠ, ప్రియాంక జంట, కీర్తి, చైతు జంట పాల్గొనబోతుందట.
యున్న కీర్తి, చైతు జంట డ్యాన్స్ వేస్తున్నప్పుడు కీర్తి బట్టలు కాస్త చిరిగిపోవడం, ఆమె వెంటనే డ్యాన్స్ ఆపేయడం వంటివి జరిగింది. ఈ కారణం చేత ఆమెకు అందరికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. వచ్చే వారం మంచి మార్కులు వచ్చినా కూడా ఈ జంట డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలే ఎక్కువ. ఈ రెండు జంటలు పోటీ పడితే, కచ్చితంగా మణికంఠ, ప్రియాంక జంట గెలుస్తుందని, కీర్తి , చైతు జంట ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరో వారం వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఈ షోలో అమర్ దీప్, నైనికా జంట మరియు మానస్, శ్రేష్టి వర్మ జంట టాప్ రేంజ్ లో ఉన్నారు.
