Allu Cinemas Controversy Kokapet Hyderabad: నిన్న హైదరాబాద్ లోని కోకాపేట లో ‘అల్లు సినిమాస్'(Allu Cinemas) గ్రాండ్ గా మొదలైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే ఈ థియేటర్ లో ఏర్పాటు చేసిన ఫోటోలు ఇప్పుడు తీవ్రమైన విమర్శలకు దారి తీసేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ థియేటర్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన లెజండరీ డైరెక్టర్స్ కి సంబంధించిన ఫోటోలను ఏర్పాటు చేశారు. వాటిలో తమిళ డైరెక్టర్ అట్లీ ఫోటో ఉండడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మన టాలీవుడ్ లో ఎంతో మంది లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళని వదిలేసి , ఇలా తమిళ డైరెక్టర్ ని పెట్టడం వెనుక అల్లు అర్జున్ ఉద్దేశ్యం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అడుగుతున్నారు.
Also Read: ఈ ఏడాదిలోనే హీరోయిన్ అనుష్క పెళ్లి.. వరుడు ఎవరో మీరే చూడండి!
‘అల్లు సినిమాస్ ‘ గ్యాలరీ లో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయంటే, రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ , త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజ్ కుమార్ హిరానీ , రిషబ్ శెట్టి , వెట్రిమారన్, మణితర్నం, అట్లీ తదితరుల ఫోటోలు ఉన్నాయి. అట్లీ కంటే గొప్ప దర్శకులు సౌత్ లో ఇక ఎవ్వరూ లేరా ?, పాన్ ఇండియా సినిమాలకు రోల్ మోడల్ లాంటి తమిళ డైరెక్టర్ శంకర్ ఫోటోని ఎందుకు పెట్టలేదు?, అంటే ఇప్పుడు ఆయన ఫ్లాప్స్ లో ఉండేలోపు అల్లు అర్జున్ కి చులకన అయిపోయాడా?. మన తెలుగు సినిమా ద్వారా పరిచయమై పాన్ ఇండియా లెవెల్ లో సునామీ ని సృష్టించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫోటో ఏది?..ప్రస్తుతం ఆయన ఫార్మ్ లో లేడు, ఆయన చుట్టూ వివాదాలు ఉన్నాయి, కానీ ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ అనేది నిజమే కదా ?, అతని ఫోటో ఎందుకు పెట్టలేదు?.. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి, అతనితో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టే , అతని ఫోటో ని ఏర్పాటు చేసాడని అనుకోవచ్చా ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.
కనీసం తనని స్టార్ హీరోల లీగ్ లోకి తీసుకొచ్చి పెట్టిన బోయపాటి శ్రీను ఫోటో పెట్టినా సంతోషించేవాళ్ళం. కేవలం తనతో పని చేస్తున్నాడు అనే ఒకే ఒక్క కారణం తో అట్లీ ఫోటోని ఆ గ్యాలరీ లోకి చేర్చడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అనేది విశ్లేషకుల వాదన. అమీర్ పేట్ లో ఉన్నటువంటి ‘AA సినిమాస్’ లాగానే థియేటర్ మొత్తం అల్లు అర్జున్ ఫొటోలతో ఇక్కడ కూడా నింపేసి ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదని అంటున్నారు. సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఈ ఫొటోలో ఉన్నవాళ్లంతా గొప్పవాళ్లే..
కాకపోతే అట్లీ స్థానంలో శంకర్, ఆర్జీవీ లాంటి దర్శకుల ఫొటో ఉంటే బాగుండేది. కనీసం ‘సరైనోడు’ లాంటి హిట్ ఇచ్చిన బోయపాటి ఉండి ఉన్నా ఓకే.
ఒకరి ఫొటో పెట్టి, మరొకరిది పెట్టకపోతే ఇదే గొడవ.
ఇదేం లేకుండా ‘AAA’లోలా అన్నీ బన్నీ ఫొటోలే… pic.twitter.com/HwSIJ6qg90
— Anwar Review’s (@AnwarReview) March 12, 2026
