https://oktelugu.com/

Allu Arvind Ali : ఇటీవలే సన్మానం అంతలోనే… అలీపై అల్లు అరవింద్ ఫైర్!

Allu Arvind fire on comedian Ali! : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని తెలివైన నిర్మాతగా అభివర్ణిస్తారు. పొదుపుగా సినిమా నిర్మించడంలో దిట్టైన అల్లు అరవింద్… సబ్జక్ట్స్ సెలక్షన్ లో కూడా నిష్ణాతుడు. అంత టాలెంట్ ఉంది కాబట్టే తండ్రి స్థాపించిన బ్యానర్ ని టాప్ లెవల్ కి తేగలిగాడు. రాబోయేది ఓటీటీల హవానే అని గమనించిన అల్లు అరవింద్ ఓటీటీ సంస్థ ఆహాను స్టార్ట్ చేశాడు. ఓన్లీ తెలుగు కాన్సెప్ట్ తో సక్సెస్ ఫుల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2022 6:28 pm
    Follow us on

    Allu Arvind fire on comedian Ali! : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని తెలివైన నిర్మాతగా అభివర్ణిస్తారు. పొదుపుగా సినిమా నిర్మించడంలో దిట్టైన అల్లు అరవింద్… సబ్జక్ట్స్ సెలక్షన్ లో కూడా నిష్ణాతుడు. అంత టాలెంట్ ఉంది కాబట్టే తండ్రి స్థాపించిన బ్యానర్ ని టాప్ లెవల్ కి తేగలిగాడు. రాబోయేది ఓటీటీల హవానే అని గమనించిన అల్లు అరవింద్ ఓటీటీ సంస్థ ఆహాను స్టార్ట్ చేశాడు. ఓన్లీ తెలుగు కాన్సెప్ట్ తో సక్సెస్ ఫుల్ గా డెవలప్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగర శివారులో అల్లు స్టూడియో నిర్మించారు. భారీ ఖర్చుతో ఆధునిక హంగులతో సినిమా నిర్మాణానికి అనువైన ఏర్పాటు చేశారు.

    ముక్కుసూటి మనిషైన అల్లు అరవింద్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఆయన నటుడు అలీపై ఓ విషయంలో ఫైర్ అయ్యారు. అలీ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేశారు. పాప్యులర్ టాక్ షో అలీతో సరదాగా కి అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన మనవడు, మనవరాలు గురించి ఆయన మాట్లాడారు. అయాన్ కంటే అర్హ చాలా తెలివైన అమ్మాయి అని పొగిడాడు. అర్హ లాంటి పిల్లలు చాలా అరుదుగా పుడతారు. మనవరాలిని మరీ పొగిడితే బాగోదు అంటూనే ప్రశంసలు కురిపించాడు.

    అనంతరం అలీ అల్లు అరవింద్ ని ఒక ప్రశ్న అడిగారు. అల్లు-చిరంజీవి కుటుంబాల మధ్య డిస్ట్రబెన్స్ లు ఉన్నాయని పుకారు, దీనికి మీ సమాధానం ఏమిటీ? అన్నారు. ఆ ప్రశ్న అల్లు అరవింద్ కి కోపం తెప్పించింది. షోలో కాంట్రవర్సీ ప్రశ్నలు ఉండవు అంటేనే నేను వచ్చాను. కాంట్రవర్సీ ఉండదు సర్ప్రైజ్లు ఉంటాయన్నారు. అవి ఇవేనా అంటూ ఒకింత అలీపై మండి పడ్డాడు. అలీతో సరదాగా ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తర్వాత ఏం జరిగింది అనేది పూర్తి షో ప్రసారమైతే కానీ తెలియదు.

    నిజానికి ఈ ప్రశ్నకు ఆల్రెడీ అల్లు అరవింద్ సమాధానం చెప్పారు. అవన్నీ పుకార్లు మాత్రమే. ప్రతి ఆదివారం, ప్రత్యేక వేడుకలకు ఇరు కుటుంబాల సభ్యులు కలుస్తారు. షూటింగ్స్, పనుల బిజీ వలన కొన్నిసార్లు కుదరకపోవచ్చు. మా కుటుంబాల మధ్య దూరం పెరిగింది అనడంలో ఎలాంటి నిజం లేదని, అవి పనిలేనివాళ్ళు పుట్టించే పుకార్లని కొట్టిపారేశారు. దీనిపై క్లారిటీ కోసమే అల్లు స్టూడియో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కమెడియన్స్ ని సత్కరించారు. వారిలో అలీ కూడా ఉన్నారు. ఆకుపై అల్లు రామలింగయ్య చిత్రం ఉన్న జ్ఞాపికను అల్లు అరవింద్ కి అలీ ఇచ్చారు.