Pushpa Movie Runtime: బాప్ రే.. పుష్ప మూవీ అన్ని గంటలా?

Pushpa Movie Runtime:  క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సినిమాలంటే ఏదో ఒక విషయం ఉంటుంది. సృజనాత్మకత కాస్త ఎక్కువగా ఉంటుంది. అతడి ప్రతి సన్నివేశం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటుంది.అందుకే చిత్రాలు కూడా మామూలు సినిమా కంటే కూడా పెద్దగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ కూడా ఔట్ పుట్ రెడీ అయ్యిందట.. ఈ మేరకు రన్ టైం చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘పుష్ప’ […]

Written By: NARESH, Updated On : December 10, 2021 11:45 am
Follow us on

Pushpa Movie Runtime:  క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సినిమాలంటే ఏదో ఒక విషయం ఉంటుంది. సృజనాత్మకత కాస్త ఎక్కువగా ఉంటుంది. అతడి ప్రతి సన్నివేశం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటుంది.అందుకే చిత్రాలు కూడా మామూలు సినిమా కంటే కూడా పెద్దగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ కూడా ఔట్ పుట్ రెడీ అయ్యిందట.. ఈ మేరకు రన్ టైం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Pushpa

‘పుష్ప’ వచ్చేవారం విడుదల కానుంది. చాలా తర్జనభర్జనల తర్వాత దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ఫైనల్ కట్ ను క్లియర్ చేశాడట.. దాదాపు 3 గంటల పాటు సినిమా ఉండబోతోంది. సాధారణంగా మన తెలుగు సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటలే ఉంటాయి. కానీ పుష్ఫ మూవీ మాత్రం ఏకంగా 2 గంటల 56 నిమిషాలపాటు అంటే దాదాపు 3 గంటలు సినిమా ఉండడం విశేషం.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల కథగా దీన్ని సుకుమార్ తీస్తున్నాడు. భారీ మలుపులు, స్పాన్ ఉన్న కథ అంట. అందుకే మంచి సీన్లను తీసేయకూడదని సుకుమార్ ఇలా 3 గంటల పాటు సినిమాను అలానే ఉంచినట్టు సమాచారం.

Also Read: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన అల్లు అర్జున్ “పుష్ప: సినిమా…

అర్జున్ రెడ్డి, బాహుబలి, రంగస్థలం వంటి సినిమాలు 3 గంటల పాటు ఉన్నప్పటికీ భారీ హిట్ లు నిలిచాయి. కథ , బలమైన పాత్రలో ఉన్న పుష్పను కూడా కట్ చేయకూడదని.. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండానే సుకుమార్ 3 గంటల పాటు తీర్చిదిద్దినట్టు సమాచారం.

మొదటి పార్ట్ నే 3 గంటల పాటు తీర్చిదిద్దిన సుకుమార్ ఇక రెండోపార్ట్ ను ఎన్ని గంటలు ఉంచుతాడోనన్నది ఆసక్తి రేపుతోంది. భారీస్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో బోలెడు అంచనాలున్నాయి.

Also Read: అల్లు అర్జున్ “పుష్ప” ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఫిక్స్… ఎక్కడంటే ?