https://oktelugu.com/

Naga Chaitanya- Samantha : సమంత తో విడాకులు రద్దు చేసుకున్న అక్కినేని నాగచైతన్య.?.

Naga Chaitanya- Samantha : సౌత్ ఇండియా మొత్తం గత ఏడాది నుండి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచినా అంశం సమంత – నాగ చైతన్య విడాకులు వ్యవహారం..సుమారు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 వ సంవత్సరం లో పెద్ద సమక్షం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు..కానీ పెళ్ళైన నాలుగేళ్లకే ఎవరి దిష్టి ఈ జంటపై తగిలిందో కానీ విడాకులు తీసుకున్నారు..ఇది వీళిద్దరిని అభిమానించే వారికి ఏ మాత్రం నచ్చలేదు..ఎదో ఒక అద్భుతం జరిగి […]

Written By: , Updated On : November 7, 2022 / 08:53 AM IST
Follow us on

Naga Chaitanya- Samantha : సౌత్ ఇండియా మొత్తం గత ఏడాది నుండి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచినా అంశం సమంత – నాగ చైతన్య విడాకులు వ్యవహారం..సుమారు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 వ సంవత్సరం లో పెద్ద సమక్షం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు..కానీ పెళ్ళైన నాలుగేళ్లకే ఎవరి దిష్టి ఈ జంటపై తగిలిందో కానీ విడాకులు తీసుకున్నారు..ఇది వీళిద్దరిని అభిమానించే వారికి ఏ మాత్రం నచ్చలేదు..ఎదో ఒక అద్భుతం జరిగి మళ్ళీ వీళ్లిద్దరు కలిసిపోతే బాగుండును అని అభిమానులు కోరుకుంటున్నారు..కానీ అది నిన్న మొన్నటి వరుకు అసాధ్యం అనే అనిపించింది కానీ..ఇప్పుడు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మళ్ళీ వీళ్లిద్దరు కలవబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు విషయానికి వస్తే సమంత చాలా కాలం నుండి మయోసిటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే..పరిస్థితి తీవ్ర రూపం దాల్చడం తో ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాను అని సమంత వేసిన ఒక ట్వీట్ అభిమానులను మరియు ఆమె శ్రేయోభిలాషులను ఎంతలా బాధపెట్టిందో మన అందరికి తెలిసిందే.

టాలీవుడ్ సెలెబ్రిటీలందరు సమంత ని తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఆ ట్వీట్ క్రింద రిప్లై ఇచ్చారు..ఇక సమంత మాజీ భర్త నాగ చైతన్య ఆమె పరిస్థితి తెలుసుకొని చాలా ఆందోళనకు గురైయ్యాడు అట..వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆమె యోగక్షేమాలను కనుక్కున్నాడట..ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం..ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ అందరితో సరదాగా ఉండే సమంత ఇలా సొమ్మసిల్లి హాస్పిటల్ బెడ్ మీద పడుండడం చూసి నాగచైతన్య మనసు చాలా డిస్టర్బ్ అయ్యిందట..సమంత తల్లి తండ్రులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది..అంతే కాకుండా ఇలాంటి సమయాల్లో సమంత కి మనోధైర్యం ఇవ్వాలని ఆమె తల్లితండ్రులకు చెప్పాడట నాగ చైతన్య.

ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున సమంత తో విడాకులు వెనక్కి తీసుకోమని నాగచైతన్య కి చెప్పినట్టు సమాచారం..ఎంతైనా ఆమెని ప్రేమించిన వాడివి..ఇలాంటి క్లిష్టమైన సమయాలలో ఆమె మనసుకి దగ్గరైన వాళ్ళు తోడు ఉండడం ఎంతో అవసరం..దయచేసి విడాకులు వెనక్కి తీసుకో..నేను వాళ్ళ కుటుంబం తో ఈ విషయం గురించి మాట్లాడుతాను అని చెప్పాడట నాగార్జున..నాగ చైతన్య కూడా అందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది..మరి సమంత ఆమె కుటుంబం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.