Lenin Movie Trailer: కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్న హీరో అక్కినేని అఖిల్. సినీ ఇండస్ట్రీ లోకి భారీ హైప్ తో ఈయన ఎంట్రీ ఇచ్చారు. కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో ఇండస్ట్రీ లోకి రాబోతున్నారు అని ప్రతీ ఒక్కరూ అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలు తలక్రిందులు అయ్యాయి. స్టార్ హీరో అవుతాడని అనుకుంటే, కనీసం మీడియం రేంజ్ హీరో మార్కెట్ ని కూడా సంపాదించలేకపోయారు. ఎన్నో ఆశల మధ్య విడుదలైన ఆయన చివరి చిత్రం ‘ఏజెంట్’ కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఆయన ఈసారి ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే కసితో ‘లెనిన్’ అనే చిత్రం లో నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 10 న విడుదల కాబోతుంది.
ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరింత సమయం కోరుతూ జులై 10 కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయాన్నీ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అక్కినేని నాగార్జున మొదటి నుండి చెప్తూనే ఉన్నారు, ఈ సినిమాలో మీరంతా సరికొత్త అఖిల్ ని చూడబోతున్నారు , చాలా గట్టిగా కొట్టబోతున్నాము అని. ట్రైలర్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి , ఫ్యాన్స్ కి కూడా ఇదే అనుభూతి కలుగుతుందట. అంత గొప్పగా నటించారట అఖిల్. అయితే ఈ చిత్రం లోని కొన్ని అంశాలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని మేకర్స్ లో కాస్త టెన్షన్ ఉందట.
ఎందుకంటే ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ చనిపోతుంది , అదే విధంగా అఖిల్ కి కళ్ళు పోతాయి. సినిమాల్లో ఇలాంటి ట్రాజెడీ సినిమాలు ఉంటే పెద్దగా వర్కౌట్ అవ్వవు , పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతుంటాయి. కానీ రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం ‘లెనిన్’ మేకర్స్ కి కాస్త ధైర్యం ఇచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి ఒక కాలు పోతుంది. అంత పెద్ద సూపర్ స్టార్ కాళ్ళు పోతేనే అడిగిన వాళ్ళు లేరు , సినిమాకు వర్కౌట్ కూడా అయ్యింది. కాబట్టి లెనిన్ కూడా అదే తరహా లో సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ట్రైలర్ లో అఖిల్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్స్ లాగా అనిపిసాయట.
