
Gopichand: టాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వడానికి అన్నీ విధాలుగా అర్హత ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది గోపీచంద్ మాత్రమే.’తొలివలపు’ అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత జయం సినిమా ద్వారా ఇండస్ట్రీ కి విలన్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత నిజం ,వర్షం వంటి సినిమాలలో కూడా విలన్ గా నటించిన గోపీచంద్, ‘యజ్ఞం’ సినిమాతో మళ్ళీ హీరో గా మారి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత వరుసగా రణం , లక్ష్యం, సౌర్యం, లౌక్యం ఇలా వరుసగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి యాక్షన్ మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ కి గత కొంతకాలం నుండి సరైన హిట్ లేదు.అంతే కాదు ఇది వరకు కెరీర్ లో ఆయన స్టార్ డైరెక్టర్స్ తో పని చెయ్యకపోవడం వల్ల స్టార్ హీరో కాలేకపోయాడు.
గోపీచంద్ పెద్ద హిట్ కొట్టాలని, మళ్ళీ ఆయన టాప్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలని కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ప్రతీ స్టార్ హీరో అభిమాని కూడా కోరుకుంటున్నాడు.అయితే ఇప్పుడు వాళ్ళ కోరికలు త్వరలోనే నెరవేరబోతోంది అనే చెప్పాలి.మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ , రవితేజ ఇలా ఇండస్ట్రీ లో టాప్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి ఇండస్ట్రీ ని షేక్ చేసిన హిట్స్ కొట్టిన శ్రీను వైట్ల తో త్వరలోనే గోపీచంద్ ఒక సినిమా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు ఇండస్ట్రీ ని వరుస హిట్స్ తో షేక్ చేసిన శ్రీను వైట్ల , ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఆయనకీ ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇచ్చే స్థానం లో లేరు.అందుకే ఆయన గోపీచంద్ ని ఎంచుకున్నాడు, ఇటీవలే గోపీచంద్ ని కలిసి స్టోరీ వినిపించగా, ఆయన కూడా ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, కానీ శ్రీను వైట్ల ని నమ్మి కోట్లు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధం గా లేరు, ప్రస్తుతం నిర్మాత కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు శ్రీను వైట్ల. మరి ఈ చిత్రం కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి.