Gopi Chand: విలన్ నుంచి హీరోగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో గోపీచంద్. కాగా ఈ యంగ్ హీరో ఇటీవల ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ చిత్రాన్ని యాక్షన్ సినిమాల డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. కానీ థియేటర్స్‌లో ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. మూడేళ్లు క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ చిత్రం ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్‌తో ఇటీవల రిలీజ్ అయ్యింది.

మొత్తంగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్స్‌లో దిగడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పైగా సమయం పట్టింది. ఇక ‘ఆరడుగుల బుల్లెట్’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే… కేవలం రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే… 1 కోటి 63 లక్షలను మాత్రమే రాబట్టింది.
మొత్తంగా రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా రూ. 1.63 కోట్లను రాబట్టింది. మొత్తంగా ఈ సి నిమాను బయ్యర్స్‌కు రూ. 1.5 కోట్ల నష్టాలను మిగిల్చింది. మరో రూ. 2 కోట్లు రాబట్టాలి. మొత్తంగా గోపీచంద్ కెరీర్‌లో ‘ఆరడుగుల బుల్లెట్’ మరో డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఇక థియేటర్స్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చకుంది. అంతే కాకుండా 10 రోజులుగా ఈ సినిమా టాప్ 2 లో ట్రెండ్ అవుతుందట. ఇక ఈ సినిమాను నిర్మాతలు రూ. 4.5 కోట్లకు అమెజాన్ ప్రైమ్‌కు అమ్మేసారట. వారం రోజుల్లో వ్యూవర్ షిప్ ఆధారంగా అమెజాన్ వాళ్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిందట. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.