https://oktelugu.com/

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ వచ్చేసిందహో..!

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంగిరి గంతేసే న్యూస్ వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్.. క్రిషన్ కుమార్.. ప్రసాద్ సుతార్.. రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కీలక అప్టేట్ ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. Also Read: క్రిష్‌పై గుర్రుగా ఉన్న పవన్ ఫ్యాన్స్.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 11:47 AM IST
    Follow us on

    యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంగిరి గంతేసే న్యూస్ వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్.. క్రిషన్ కుమార్.. ప్రసాద్ సుతార్.. రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కీలక అప్టేట్ ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

    Also Read: క్రిష్‌పై గుర్రుగా ఉన్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

    ‘ఆదిపురుష్’ మూవీ రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కన్పించనున్నాడు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవలే ‘ఆదిపురుష్’ చిత్రయూనిట్ విడుదల చేయగా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందనే టాక్ విన్పిస్తోంది.

    ‘ఆదిపురుష్’ సైట్స్ పైకి వెళ్లకముందే సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్రాఫిక్స్ మాయజాలం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్లో సగం ఖర్చు గ్రాఫిక్స్ కే కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఉండగానే ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది.

    ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ‘ఆదిపురుష్’ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే చిత్రయూనిట్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వచ్చే జనవరిలో ‘ఆదిపురుష్’ సైట్స్ పైకి వెళ్లనుండగా 2022లో సినిమా రిలీజ్ కానుందని వార్తలు విన్పించాయి. దీనిని నిజం చూస్తూ ‘ఆదిపురుష్’ టీం తాజాగా రిలీజ్ డేట్స్ ప్రకటించి సంచలనం సృష్టించింది.

    Also Read: మహేష్ బాబు చిల్ అవడానికి ఏం చేస్తాడో తెలుసా?

    ‘ఆదిపురుష్’ మూవీని 11-08-2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు అప్డేట్స్ తో అభిమానుల్లో జోష్ నింపిన ‘ఆదిపురుష్’ టీం తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సినిమాపై తమ కమిట్ మెంట్ ను చాటుకుంది. మొత్తానికి ‘ఆదిపురుష్’ మూవీ సైట్స్ పైకి వెళ్లకముందే అందరి దృష్టికి ఆకర్షిస్తూ సంచలనాలను సృష్టిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్