Prabhas Marriage: ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు శుభవార్త అన్న కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ .. వరల్డ్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలే తీస్తున్న ఈయన.. కొన్ని సంవత్సరాలపాటు బిజీ లైఫ్ గడపనున్నారు. అయితే ప్రభాస్ సినీ కెరీర్ అంతా అనుకున్నట్టే సాఫీగా జరుగుతున్నా.. పర్సనల్ లైఫ్ గురించి ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆయనతో కొందరు హీరోయిన్లు సన్నిహితంగా ఉన్నారని, వారిని పెళ్లి చేసుకుంటారని రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ ప్రభాస్ ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది అదేంటంటే?
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఓ అమ్మాయితో ప్రభాస్ ఫోటో దిగడంతో ఆమెనే పెళ్లి చేసుకుంటారని అన్నారు. కానీ ఆ తర్వాత హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నారని ఆమెనే పెళ్లి చేసుకుంటారని కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఇటు ప్రభాస్ కాని అటు అనుష్క గాని స్పందించలేదు. దీంతో ఇవి రూమర్స్ అని తేలిపోయాయి. అయితే అటు ప్రభాస్ కానీ ఇటు అనుష్క గాని పెళ్లి చేసుకోకుండా ఉండడంతో భవిష్యత్తులో ఎప్పటికైనా వీరే కలిసి ఉంటారని కొందరు అన్నారు. అయితే ఆ విషయంపై ఎటువంటి క్లారిటీ ఎవరు ఇవ్వలేదు.
తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆసక్తి చర్చ సాగుతోంది. ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని కాకుండా బంధువుల కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. అంతేకాకుండా ప్రభాస్ ను పెళ్లి చేసుకునేందుకు ఆమె సిద్ధంగా కూడా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లి విషయంలో ప్రభాస్ ఇప్పటికే చాలా లేట్ చేశాడని, ఇక వెయిట్ చేయకుండా ఆ అమ్మాయికి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రభాస్ చేసుకునే అమ్మాయి వేరే ఉద్యోగం చేస్తుందని కొందరు అంటున్నారు.. మరికొందరు మాత్రం ఆమె ఎలాంటి ఉద్యోగం చేయడం లేదని చెబుతున్నారు.. ఏది ఏమైనా ప్రభాస్ చేసుకునే అమ్మాయి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాదని తేలిపోయింది ..
ఇది ఇలా ఉండగా ప్రభాస్ పెళ్లి చేసుకుని అమ్మాయి ఎలా ఉంటుందో అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికైనా ప్రభాస్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో రెండు సంవత్సరాల పాటు తీరికలేకుండా ఉండనున్నారు. ఈ తరుణంలో ఆయన పెళ్లిపై క్లారిటీ ఇస్తారా? లేక సినిమాలతోనే సినిమాలపైనే దృష్టి పెడతారా. అనేది తెలియాల్సి ఉంది.