Godfather First Week Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ నెలకొల్పుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం విడుదలై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది..ఈ వారం రోజుల్లో ఈ సినిమా స్టడీ రన్ ని చూపిస్తూ అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంది..సాధారణంగా దసరా సెలవులు తర్వాత సినిమాలకు పెద్దగా రన్ ఉండదు అని అందరూ అంటూ ఉంటారు..కానీ గాడ్ ఫాదర్ సినిమా మాత్రం ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది..5 రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా సోమవారం రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..మళ్ళీ మంగళవారం రోజు కూడా ఈ సినిమా అదే రేంజ్ వసూళ్లను రాబట్టి స్థిరమైన వసూళ్లను రాబడుతున్న సినిమాగా నిలిచింది..ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 11.77 కోట్లు
సీడెడ్ 9.00 కోట్లు
ఉత్తరాంధ్ర 5.36 కోట్లు
ఈస్ట్ 3.40 కోట్లు
వెస్ట్ 1.98 కోట్లు
నెల్లూరు 1.90 కోట్లు
గుంటూరు 4.00 కోట్లు
కృష్ణ 2.50 కోట్లు
మొత్తం 40.00 కోట్లు
ఓవర్సీస్ 4.60 కోట్లు
కర్ణాటక 4.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.60 కోట్లు
వరల్డ్ వైడ్ 54.70 కోట్లు
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది..కేవలం నైజం మరియు ఓవర్సీస్ లో మాత్రమే అడ్వాన్స్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, మిగిలిన చోట్ల కమిషన్ బేసిస్ మీదనే బిజినెస్ ని జరుపుకుంది..అంటే వచ్చే గ్రాస్ లో 50 శాతం డిస్ట్రిబ్యూటర్స్ కి పోతే మిగిలిన 50 శాతం నిర్మాతకి వెళ్తుంది అన్నమాట..ఆ లెక్కన ఈ సినిమా నిర్మాతలకు మరియు బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమానే..కలెక్షన్స్ వీక్ డేస్ లో కూడా స్టడీ గా ఉండడం తో ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..కానీ ఒక పెద్ద హీరో సినిమాకి ఓపెనింగ్స్ చాలా కీలకం.
గాడ్ ఫాదర్ విషయం లో ఓపెనింగ్స్ దగ్గరే సమస్య వచ్చింది..టికెట్ రేట్స్ లేకపోవడం తో పాటుగా లిమిటెడ్ రిలీజ్ కూడా ఉండడం ఈ సినిమాకి పెద్ద శాపం లాగ మారింది..దసరా రోజు గాడ్ ఫాదర్ తో పాటుగా నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ స్వాతి ముత్యాలు సినిమాలు విడుదల అయ్యాయి..ఈ రెండు సినిమాలు చిరంజీవి సినిమాతో పోటీ పడే స్థాయి లేకపోయినప్పటికీ కూడా పెద్ద నిర్మాణ సంస్థల నుండి వచ్చిన సినిమాలు కావడం తో థియేటర్స్ ని బాగా హోల్డ్ చేసారు..థియేటర్స్ హోల్డ్ చేసి ఆ రెండు సినిమాలు లాభపడ్డాయా అంటే అది లేదు..చిరంజీవి సినిమాకి నష్టం చెయ్యడానికి వచ్చాము అన్నట్టు ఈ రెండు వచ్చాయి..దీనికి మెగాస్టార్ అభిమానులు చాలా తీవ్రంగా నిరాశకి గురైయ్యారు..సోలో రిలీజ్ దొరికి ఉంటె కలెక్షన్స్ ఇంకా అద్భుతంగా ఉండేవని అభిమానులు బాధపడుతున్నారు.