Ram Charan Sukumar Movie: విభిన్నమైన ఆలోచనలతో సినిమాలు తీస్తూ మన టాలీవుడ్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకులలో ఒకరు సుకుమార్(Sukumar). ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ మధ్యలో ఆయన తీసిన సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా సుకుమార్ కి యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. ‘రంగస్థలం’ సెన్సేషనల్ హిట్ అవ్వడం, ఆ తర్వాత పుష్ప సిరీస్ తో సుకుమార్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం, ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారడం వంటివి చకచకా జరిగిపోయాయి. ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘పుష్ప’ తర్వాత కొన్ని నెలల నుండి అబుదాబి లో రిలాక్స్ అవుతున్న సుకుమార్, త్వరలోనే చరణ్ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ ని మొదలు పెట్టబోతున్నాడు.
Also Read: పోకిరీ తీసి పూరి నమ్మలేదు.. కృష్ణ ముందే చెప్పాడు…
‘రంగస్థలం’ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కాబట్టి, కచ్చితంగా అభిమానులు పాన్ వరల్డ్ రీచ్ ఉండే సినిమానే కోరుకుంటారు. అందుకోసం చరణ్ తో పలు మార్లు చర్చించిన సుకుమార్, ముందుగా జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ జానర్ చిత్రం చేద్దామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, సుకుమార్ రామ్ చరణ్ తో కౌ బాయ్ జానర్ లో ఒక సినిమా చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడట. ఈ జానర్ లో ఇప్పుడు ఇండియా లో ఎవ్వరూ సినిమాలు చేయడం లేదు. అలాంటి సమయం లో ఇలాంటి జానర్ ని ఎంపిక చేసుకొని, సరైన స్క్రీన్ ప్లే తో ముందుకు వెళ్తే, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చెయ్యొచ్చు అనేది సుకుమార్ ఆలోచన. రామ్ చరణ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Also Read: వచ్చిన టాక్ కి..వస్తున్న ఓపెనింగ్ కి సంబంధమే లేదు..పాపం ‘కింగ్డమ్’ పరిస్థితి ఏంటంటే!
కానీ కౌ బాయ్ జానర్ సినిమాలు మన టాలీవుడ్ లో అంతగా సక్సెస్ కాలేదు. కేవలం సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే కో బాయ్ చిత్రం మాత్రమే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’ చిత్రం చేశాడు. ఇది కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. వీళ్లిద్దరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ చిత్రం చేశాడు. ఇది కమర్షియల్ గా ఆరోజుల్లో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత కౌ బాయ్ జానర్ లో ఏ స్టార్ హీరో కూడా సినిమాలు చేయలేదు. అలాంటి జానర్ ని ఎంచుకొని చేయాలనుకోవడం నిజంగా సాహసమే కదా, చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.